తల్లిని చూడడానికి వస్తూ అనంతలోకాలకు.. | - | Sakshi
Sakshi News home page

తల్లిని చూడడానికి వస్తూ అనంతలోకాలకు..

Jun 10 2023 1:38 AM | Updated on Jun 10 2023 1:02 PM

- - Sakshi

సుమిత్‌రెడ్డి (27), పూజితారెడ్డి(24) ఉన్నారు. పూజితారెడ్డి హైదరాబాద్‌లోని ఓ కంపెనీలో సాప్ట్‌వేర్‌గా పనిచేస్తుండగా

వరంగల్ : రెండు రోజులు సెలవులు ఉండడంతో తల్లిని చూడడానికి స్వగ్రామానికి వస్తున్న అన్నా చెల్లెలు రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. హసన్‌పర్తి మండలం నాగారం గ్రామానికి చెందిన పోరెడ్డి సుజాత– దేవేందర్‌రెడ్డి దంపతులకు కుమారుడు సుమిత్‌రెడ్డి (27), పూజితారెడ్డి(24) ఉన్నారు. పూజితారెడ్డి హైదరాబాద్‌లోని ఓ కంపెనీలో సాప్ట్‌వేర్‌గా పనిచేస్తుండగా, సుమిత్‌ ప్రైవేట్‌ ఉద్యోగిగా పనిచేస్తున్నాడు.

శని, ఆదివారాల్లో సెలవులు ఉండడంతో తల్లిని చూడడానికి బైక్‌పై నాగారం వస్తున్నారు.ఈ క్రమంలో బైక్‌.. ధర్మసాగర్‌ మండలం కరుణాపురం వద్ద ప్రధాన రహదారిపై నిలిపి ఉన్న లారీ కిందికి దూసుకెళ్లింది. దీంతో వారు అక్కడిక్కడే ప్రాణాలు వదిలారు.

అనాథ అయిన తల్లి
కాగా, కొడుకు, కూతురు మృతి చెందడం, అంతకుముందే భర్తను కోల్పోవడంతో ప్రస్తుతం ఆ తల్లి అనాథ అయింది. కష్టాలు తీరుతాయని సంతోష పడిన తల్లికి మరిన్ని కష్టాలు తోడయ్యాయి. కొడుకు, కూతురు మృతదేహాలపై ఆ తల్లి పడి ఏడుస్తుండగా, అక్కడ ప్రతి ఒక్కరూ కన్నీటి పర్యంతమయ్యారు.

Advertisement
 
Advertisement
Advertisement