జలసవ్వళ్లు.. | - | Sakshi
Sakshi News home page

జలసవ్వళ్లు..

Jul 31 2026 12:45 AM | Updated on Jul 31 2026 12:45 AM

ఉధృతంగా జాలువారుతున్న బొగత

ప్రమాద స్థాయి దాటి ప్రవహించడంతో సందర్శన నిలిపివేత

వాజేడు: ములుగు జిల్లా వాజేడు మండల పరిధిలోని బొగత జలపాతం గురువారం పాలనురగలా జాలువారింది. అయితే జలపాతం ఉధృతంగా ప్రవహిస్తుండడంతో బుధవారం నుంచి పర్యాటకుల సందర్శనను తాత్కాలికంగా నిలిపి వేశారు. వాజేడు మండలంలో మంగళవారం 138.20, గురువారం 150.4 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదు కాగా గుట్టలపై భారీ వర్షం కురువడంతో జలపాతం ప్రమాద స్థాయిని దాటి ప్రవహిస్తోంది. ఉధృతంగా జాలువారి స్నానాల కొలను ముంచెత్తడంతోపాటు వరద ఉధృతి పెరగడంతో తాత్కాలికంగా సందర్శన నిలిపి వేశారు. ఉన్నతాధికారుల ఆదేశాలు మేరకు తిరిగి జలపాతం సందర్శనను అనుమతిస్తామని స్థానిక అధికారులు తెలిపారు.

వారం రోజులుగా కురుస్తున్న వర్షాలకు మహబూబాబాద్‌ జిల్లా గూడూరు మండలం సీతానగరం సమీపంలోని భీముని పాదం జలపాతం జాలువారుతోంది. పాలనురగలా దూకుతూ పర్యాటకులకు ఆహ్లాదం పంచుతోంది.

– సాక్షి స్టాఫ్‌ ఫొటోగ్రాఫర్‌,

మహబూబాబాద్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement