కాజీపేట : మందులులేక.. ఆహారం అందక..దయనీయ స్థితిలో మాజీ ఎమ్మెల్సీ కుమారుడు అంటూ ‘సాక్షి’లో మంగళవారం ప్రచురితమైన కథనానికి జిల్లా అధికార యంత్రాంగం స్పందించింది. కలెక్టర్ చాహత్ బాజ్‌పాయ్ ఆదేశం మేరకు అడిషనల్ కలెక్టర్ ఎన్.రవి స్వయంగా మాజీ ఎమ్మెల్సీ కొండపర్తి మనోహర్‌రావు కుమారుడు సురేందర్ రావుకు ఫోన్ చేసి ఆరోగ్యం, ఆర్థిక స్థితిపై వాకబు చేశారు. అడిషనల్ కలెక్టర్ సూచన మేరకు బుధవారం రాత్రి సురేందర్ రావు కలెక్టరేట్‌కు వెళ్లి కుటుంబ నేపఽథ్యంతోపాటు తన ధీనస్థితిని వివరిస్తు కన్నీళ్లు పెట్టుకున్నారు. కలెక్టర్ స్పందించి జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారి అప్పయ్యకు ఫోన్ చేసి సురేందర్ రావుకు తగిన వైద్య సహా యం అందించేలా ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. అదేవిధంగా సురేందర్ రావుకు పెన్షన్ మంజూరు చేయాలని అధికారులకు సూచించారు. కాగా, కొండంత బలగం ఉన్నా పట్టించుకోని ఈ రోజుల్లో జిల్లా అధికారులు స్పందించి చేయూతనందించడానికి ఏర్పాట్లు చేయడంతో బాధితుడితో పాటు కడిపికొండ గ్రామస్తులు కలెక్టర్‌కు కృతజ్ఞతలు తెలిపారు.
నైరుతి నుంచి దక్షిణం వరకు ప్రాకారం తొలగింపు
కాళేశ్వరం: జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలం కాళేశ్వరం దేవస్థానం పాత నిర్మాణాలు తొలగింపు ప్రక్రియ గురువారం సాయంత్రం నుంచి ప్రారంభమైంది. కాంట్రాక్టర్లు ప్రొక్లైనర్‌తో నైరుతి నుంచి దక్షిణం వరకు ప్రాకారాన్ని తొలగించారు. వర్షం కొంత విరామం ఇవ్వడంతో ప్రాకారం తొలగించి, దేవస్థానం లోపలికి వెళ్లేందుకు దక్షిణం వైపున ఉన్న శివుడి విగ్రహం పక్క నుంచి సరస్వతి అమ్మవారి ఆలయం ఎదుట రెండు పిల్లర్లు తీసి ప్రకారం తొలగించి దారి చేశారు. టిప్పర్లు, మెటీరియల్ వాహనాలు, కూలీలు తిరిగేందుకు వీలుగా తొలగింపు ప్రక్రియ ప్రారంభించారు.
పెరిగిన పంటల ధరలు..
● పత్తి రూ.9,350, మొక్కజొన్న రూ.2,550
ఖిలా వరంగల్: వరంగల్ ఏనుమాముల వ్యవసాయ మార్కెట్‌లో గురువారం ఉదయం పత్తి, మొక్కజొన్నల ధర అమాంతం పెరిగింది. యార్డుకు వచ్చిన కొద్దిపాటి పత్తి, మొక్కజొన్న పంటలకు వేలం వేయగా వ్యాపారుల మధ్య పోటీ పెరిగింది. దీంతో పత్తికి రూ.9350, మొక్కజొన్నకు రూ.2,550 ధర పలికింది. ఏడాది భారీ స్థాయిలో పెరగడం ఇదే మొదటిసారని రైతులు, వ్యాపార వర్గాలు చెబుతున్నాయి. పెరిగిన ధరలను చూసిన రైతులు ఆనందం వ్యక్తం చేసినట్లు మార్కెట్ కార్యదర్శి శ్రీనివాస్ తెలిపారు.
ఆస్పత్రి నుంచి వీసీ ప్రతాప్‌రెడ్డి డిశ్చార్జ్
కేయూ క్యాంపస్: కాకతీయ యూనివర్సిటీ వీసీ కె. ప్రతాప్‌రెడ్డి అస్వస్థతకు గురై హనుమకొండలోని ఓప్రైవేట్ ఆస్పత్రిలో చేరగా పరీక్షించిన వైద్యులు గుండెకు రెండు బ్లాక్‌లు ఉండడంతో స్టంట్లు అమర్చిన విషయం విధితమే. చికిత్స అనంతరం కోలుకున్న ప్రతాప్‌రెడ్డిని గురువారం డిశ్చార్జ్ చేశారు. అనంతరం తన సతీ మణితో కలిసి హైదరాబాద్‌లోని తన నివాసానికి వెళ్లారు. వైద్యుల సూచన మేరకు వారం రో జుల విరామం తర్వాత వీసీ ప్రతాప్‌రెడ్డి యూని వర్సిటీకి రానున్నారని రిజిస్ట్రార్ వి. రామచంద్రం తెలిపారు.


