ప్రతీకాత్మక చిత్రం (ఏఐ ఫోటో)
శిశువు వద్దంటూ తల్లి కాఠిన్యం
కర్ణాటక, చిక్కబళ్లాపురం: ఆసుపత్రిలో ఓ అవివాహిత గర్భిణి బిడ్డకు జన్మనిచ్చి తనకు ఆ శిశువు వద్దని చెప్పడంతో వైద్యులు, అధికారులకు తెల్లమొహం వేశారు. విరాలు.. హావేరి జిల్లాకు చెందిన యువతి (21) కి ఇంకా పెళ్లి కాలేదు. గర్భం దాల్చి నెలలు నిండాయి.
దేవనహళ్లి లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేరగా మగబిడ్డ పుట్టాడు. శిశువు తక్కువ బరువు, ఊపిరి సమస్యతో ఉండడంతో చికిత్స అందిస్తున్నారు. ఆస్పత్రి బిల్లులను ఆమె చెల్లించింది. తనకు బిడ్డ వద్దని, తాను ఊరికి వెళ్లిపోతానని వైద్యులకు చెప్పడంతో వారు కంగుతిన్నారు. వైద్యులు పోలీసులకు తెలుపగా వచ్చి ఆమె ఊరు పేరు వివరాలను విచారించారు. శిశు సంక్షేమ శాఖ అధికారులు ఆమెకు నచ్చజెప్పడానికి ప్రయత్నం చేస్తున్నారు.


