కర్ణాటక, బొమ్మనహళ్లి: సాధారణంగా మనుషుల దంతాలకు సమస్య వస్తే రూట్ కెనాల్ చేయించుకుంటారు. పులికి సైతం దంతం పాడైపోవడంతో దానికి రూట్ కెనాల్ సర్జరీ చేశారు. బెంగళూరు బన్నేరుఘట్ట జూ పార్క్‌లో కొన్ని పులులు ఉన్నాయి.
వీటిలో సించన అనే పులి కోర పంటి ఇన్ఫెక్షన్‌తో బాధపడుతోంది. ఆ పులి బోను కడ్డీని కొరకడం వల్ల దాని కోర పన్ను దెబ్బతింది. దీనివల్ల ఇన్ఫెక్షన్ సోకింది. నొప్పి ఎక్కువ కావడంతో సరిగా ఆహారం కూడా తీసుకోవడం లేదు. దీని వల్ల పులి ఆరోగ్యం అంత బాగా లేదు. పులిని పరీక్షించిన పశువైద్యులు దాని పంటికి చికిత్స చేయాలని నిర్ణయించారు. మత్తు మందు ఇచ్చి 3 గంటలకు పైగా శ్రమించి రూట్ కెనాల్ చికిత్సను నిర్వహించారు.


