తాగునీటి కోసం రోడ్డెక్కిన మహిళలు | - | Sakshi
Sakshi News home page

తాగునీటి కోసం రోడ్డెక్కిన మహిళలు

Nov 10 2026 1:31 AM | Updated on Nov 10 2026 1:31 AM

● ఖాళీ బిందెలతో నిరసన

● అధికారులపై ఎమ్మెల్యే

వై.బాలనాగిరెడ్డి ఆగ్రహం

కోసిగి: తాగునీటి కోసం సోమవారం కోసిగి సిద్దప్ప పాళెం మహిళలు రోడ్డెక్కి ఖాళీ బిందెలతో నిరసన తెలిపారు. కాలనీలో దాదాపు 15 రోజులుగా కుళాయిలకు నీరు రావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. పంచాయతీ అధికారులకు పలుమార్లు విన్నవించినా పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆరునెలల క్రితం ఇంటింటా కుళాయిలు ఏర్పాటు చేయిస్తామని కొత్త పైప్‌లైన్‌ వేసి మధ్యలోనే వదిలేశారన్నారు. బిందెలను పట్టుకుని ఇతర కాలనీలు, దూర ప్రాంతాల కుళాయిలకు వెళ్లినా దొరకని పరిస్థితి నెలకొందన్నారు. సమస్య పరిష్కరించ వరకు నిరసన విరమించేది లేదని భీష్మించారు. పోలీసులు అక్కడకు చేరుకుని ఆందోళనకారులతో మాట్లాడారు. తాత్కాలికంగా ట్యాంకర్లు ఏర్పాటు చేస్తామని చెప్పడంతో ఆందోళన విరమించారు.

అధికారులపై ఎమ్మెల్యే ఆగ్రహం

కోసిగి ప్రజలు తాగునీటి కోసం రోడ్డెక్కారు అనే విషయం తెలిసిన వెంటనే ఎమ్మెల్యే వై.బాలనాగిరెడ్డి ఆర్‌డబ్ల్యూఎస్‌ అధికారులకు ఫోన్‌ చేశారు. నీటి కోసం ప్రజలు రోడ్డెక్కుతుంటే ఏమి చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలకు నిరంతరంగా తాగునీటిని అందించాలని ఆదేశించారు. అవసరమైన ప్రాంతంలో కొత్త పైప్‌లైన్‌, కొత్త బోరు వేసేలా చూడాలన్నారు. అధికారులు నిర్లక్ష్యం వహించకుండా బాధ్యతా యుతంగా విధులు నిర్వర్తించాలని సూచించారు. కోసిగిలోని 1వ వార్డులో వెంటనే తాగునీటి సరఫరా చేసేలా చూడాలన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement