తక్కువ ధరకే బియ్యం..అందనంత దూరం! | - | Sakshi
Sakshi News home page

తక్కువ ధరకే బియ్యం..అందనంత దూరం!

Nov 10 2026 1:31 AM | Updated on Nov 10 2026 1:31 AM

కర్నూలు(అగ్రికల్చర్‌): తక్కువ ధరకే బియ్యం పంపిణీ నామమాత్రానికే పరిమితం అయ్యింది. సామాన్య, మధ్య తరగతి కుటుంబీకులు ఒక బస్తా బియ్యం కొనలేకపోతున్నారు. చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి రాక ముందు 2024 మార్చిలో 25కిలోల బియ్యం రూ.1,200 మాత్రమే. ప్రస్తుతం బహిరంగ మార్కెట్‌లో 25 కిలోల బియ్యం బస్తా ధర రూ.2,300 నుంచి రూ.2,400 ఉంటోంది. ధరలు రెట్టింపు అయిన నేపథ్యంలో తక్కువ ధరకే 25 కిలో బియ్యం బస్తా రూ.1300 ప్రకారం పంపిణీ చేస్తున్నామని ప్రభుత్వం ప్రచారం చేసింది. అయితే జిల్లాలో ఎక్కడా పంపిణీ చేయలేదు. అర్బన్‌ లోకల్‌ బాడీస్‌ ఎన్నికల నేపథ్యంతో ఓటర్లను ఆకట్టుకునేందుకు తక్కువ ధరకే రైతు బజార్ల ద్వారా పౌరసరఫరాల శాఖ బియ్యం పంపిణీ చేపట్టింది. ఇది కూడా ఈ నెల 2వ తేదీ అరకొరగా పంపిణీ చేశారు. అ తర్వాత బియ్యం పంపిణీ జాడ లేకుండా పోయింది. నిత్యం వందలాది మంది వినియోగదారులు బియ్యం కోసం వచ్చి వెనక్కి పోతున్నారు. వినియోగదారుల తాకిడి తట్టుకోలేక రైతుబజార్లలో బియ్యం స్టాకు లేదు అనే బోర్డులు ఉంచారు. రాష్ట్ర చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా బియ్యం ధరలు పెరిగిపోవడానికి చంద్రబాబు సర్కారే కారణమనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో కిలో బియ్యం రూ.100 ఆపైనే అమ్మకాలు సాగిస్తుండటం గమనార్హం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement