లారీ చోరీ | - | Sakshi
Sakshi News home page

లారీ చోరీ

Nov 10 2026 2:01 AM | Updated on Nov 10 2026 2:01 AM

కర్నూలు: కర్నూలు శివారు కోడుమూరులోని రిలయన్స్‌ మాల్‌ వెనుక భాగంలో లోకల్‌ లారీ అసోసియేషన్‌ ఆఫీస్‌ వద్ద పార్కు చేసి ఉంచిన లారీ చోరీకి గురైంది. కర్నూలు పాతబస్తీ ఉస్మానియా కళాశాల రోడ్డులో నివాసముంటున్న ప్రేమ్‌నాథ్‌ లారీ ఓనర్‌ కమ్‌ డ్రైవర్‌. ఈయన ప్రతిరోజూ బాడుగలకు వెళ్లి రాత్రికి లోకల్‌ లారీ అసోసియేషన్‌ కార్యాలయం వద్ద తన వాహనాన్ని పార్కు చేసి ఉంచుతాడు. ఇందులో భాగంగా ఈ నెల 7వ తేదీ కూడా తన లారీని అక్కడే పార్కు చేసి ఉంచాడు. మరుసటి రోజు మధ్యాహ్నం 12 గంటలకు అక్కడికి వెళ్లి చూడగా లారీ కనిపించలేదు. ఈ విషయం అసోసియేషన్‌ నాయకుల దృష్టికి తీసుకెళ్లగా ఆ ప్రాంతంలో ఉన్న సీసీ కెమెరాలు పరిశీలించారు. ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు లారీని తీసుకెళ్లినట్లు సీసీ కెమెరాలో నిక్షిప్తమై ఉంది. దీంతో ప్రేమ్‌నాథ్‌ పోలీసులను ఆశ్రయించారు. తన లారీ చోరీకి గురైందని, వెతికిపెట్టాలని వినతిపత్రం సమర్పించాడు. ఈ మేరకు పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

యాళ్లూరులో వ్యక్తి ఆత్మహత్య

గోస్పాడు: పుట్టింటికి వెళ్లిన భార్య రాలేదని భర్త ఈశ్వరయ్య(34) ఆత్మహత్యకు పాల్పడిన ఘటన సోమవారం యాళ్లూరు గ్రామంలో చోటుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు గ్రామానికి చెందిన ఈశ్వర్యయ్యకు ఆర్‌ఎస్‌ రంగాపురానికి చెందిన మహిళతో 12 ఏళ్ల క్రితం వివాహం అయ్యింది. వీరిద్దరి మధ్య మనస్పర్ధలు రావడంతో భార్య పుట్టింటికి వెళ్లింది. ఇటీవల అనారోగ్యంతో బాధపడుతున్నా భార్య కాపురానికి రాలేదని మనస్తాపానికి గురైన ఈశ్వరయ్య ఆదివారం రాత్రి పురుగుల మందు తాగాడు. అపస్మారక స్థితిలో పడిఉన్న ఆయనను గమనించిన స్థానికులు చికిత్స నిమిత్తం గ్రామంలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కోలుకోలేక అక్కడే మృతిచెందాడు. మృతునికి ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ సుధాకర్‌రెడ్డి తెలిపారు.

భార్యను హత్య చేసిన వ్యక్తిని కఠినంగా శిక్షించాలి

పత్తికొండ: కుటుంబ కలహాలతో భార్యను హత్య చేసిన భర్తను కఠినంగా శిక్షించాలని మృతురాలు మహేశ్వరి కుటుంబ సభ్యులు డిమాండ్‌ చేశారు. ఆదివారం పత్తికొండ పట్టణంలోని నాలుగు స్తంభాల కూడలి వద్ద ప్రధాన రహదారిపై మృతురాలి కుటుంబ సభ్యులు కాలనీ వాసులతో కలిసి ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... ‘6నెలలు కిందట ఆస్పరి మండలం తురవగల్లు గ్రామానికి చెందిన మల్లికార్జునకు తమ కూతురు మహేశ్వరిని ఇచ్చి పెళ్లి చేశాం. కొద్ది రోజులకే అదనపు కట్నం తీసుకురావాలని చిత్రహింసలు పెట్టి చివరకు ఇంట్లో ఉరి వేసి చంపేశాడ’ని వాపోయారు. కిరాతకంగా తమ బిడ్డను చంపిన మల్లికార్జునను కఠినంగా శిక్షించాలని డిమాండ్‌ చేశారు.

దేవాలయానికి వెళ్తూ మృత్యువాత

బండిఆత్మకూరు: అమావాస్య సందర్భంగా ఆటోలో దేవాలయానికి వెళ్లే క్రమంలో ప్రమాదం జరిగి సోమవారం ఒక మహిళ మృతి చెందారు. వెలుగోడు మండలంలోని గుంతకందాల గ్రామానికి చెందిన విజయుడు తన కుటుంబ సభ్యులతో కలిసి ఆటోలో నంద్యాల పట్టణంలోని జగజ్జననీ ఆలయానికి బయలుదేరారు. పెద్దదేవలాపురం గ్రామ ఏకశిల ఆంజనేయ స్వామి దేవాలయం వద్ద రోడ్డుపై ఉన్న కుక్కను తప్పించబోయే క్రమంలో ఆటో అదుపు తప్పి పక్కనే ఉన్న బ్రిడ్జ్‌ అంచులకు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో జంగం సోమేశ్వరి (36) అక్కడికక్కడే మృతి చెందారు. శారదమ్మ అనే వృద్ధురాలికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వారిన స్థానికులు 108లో ఆసుపత్రికి తరలించారు. ఆటో డ్రైవర్‌ విజయుడు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి విచారణ చేపట్టినట్లు ఎస్‌ఐ జగన్‌మోహన్‌ తెలిపారు.

కుక్కను తప్పించబోయి..

గోనెగండ్ల: కుక్కను తప్పించబోయి కిందపడిన ఘటనలో ఓ వ్యక్తి మృతి చెందాడు. సీఐ చంద్రబాబు తెలిపిన వివరాల మేరకు.. పెద్దనేలటూర్‌ గ్రామానికి చెందిన గొల్ల రంగన్న (34) సజ్జ పంట సాగుచేశాడు. ఆదివారం రాత్రి ఆ పంటకు నీళ్లు కట్టి తిరిగి ఇంటికి బైకుపై వస్తున్న క్రమంలో అలువాల రోడ్డులో కుక్క అడ్డం వచ్చింది. రంగన్న ఆ కుక్కను తప్పించబోయి అదపుతప్పి కింద పడ్డాడు. తలకు తీవ్రగాయమై ముక్కు, చెవిలోంచి రక్తం వచ్చింది. అటుగా వెలుతున్న వారు కుటుంబ సభ్యులకు సమాచారం ఇవ్వడంతో వారు వెళ్లి రంగన్నను అంబులెన్స్‌లో కర్నూలు ఆసుపత్రికి తరలించగా కోలుకోలేక సోమవారం తెల్లవారు జామున మృతిచెందాడు. మృతుడికి భార్య సరస్వతి, ఇద్దరు పిల్లలున్నారు. కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement