
పెద్దాసుపత్రి సూపరింటెండెంట్‌కు పదోన్నతి
కర్నూలు(హాస్పిటల్): కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాల సూపరింటెండెంట్ డాక్టర్ కె.వెంకటేశ్వర్లుకు పదోన్నతి లభించింది. ప్రొఫెసర్‌గా ఉన్న ఆయనకు అడిషనల్ డీఎంఈగా పదోన్నతి కల్పిస్తూ వైద్య ఆరోగ్యశాఖ ప్రత్యేక కార్యదర్శి కృష్ణ బాబు మంగళవారం జీవో జారీ చేశారు. డాక్టర్ వెంకటేశ్వర్లు గుంటూరులో ఎంబీబీఎస్‌ను, తిరుపతి స్విమ్స్‌లో ఆర్థో పీజీని అభ్యసించారు. ఆ తర్వాత కర్నూలు ప్రభుత్వాసుపత్రిలో ఆర్థోపెడిక్ విభాగంలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా, అసోసియేట్ ప్రొఫెసర్‌గా, ప్రొఫెసర్‌గా, హెచ్‌ఓడీగా పనిచేశారు. గత సంవత్సరం అక్టోబర్ 29న ఆయన ఆసుపత్రి సూపరింటెండెంట్‌గా ఫుల్ అడిషనల్ చార్జి(ఎఫ్‌ఏసీ)తో నియమితులయ్యారు. ప్రస్తుతం పదోన్నతితో రెగ్యులర్ సూపరింటెండెంట్‌గా కొనసాగనున్నారు.