
గ‘మ్మత్తు’ టానిక్.. గప్‌చుప్ పోలీస్!
కర్నూలు: టానిక్... కర్నూలు ఐదు రోడ్ల కూడలిలో కార్పొరేట్ తరహాలో ఏర్పాటు చేసిన లైసెన్స్‌డ్ మద్యం దుకాణం. వ్యాపార లావాదేవీలు ఇక్కడే జరగాలి. ఈ దుకాణానికి సంబంధించిన మద్యం మరో చోట అక్రమంగా నిల్వ చేసి విక్రయాలు జరపరాదు. అయితే దుకాణ యజమానులు అధికార పార్టీకి చెందిన వారు కావడంతో తమ వ్యాపారం అక్రమమా.. సక్రమమా.. అని అడిగేవారు ఎవరనే ధీమాతో నిబంధనలు ఉల్లంఘించారు. వినాయక నిమజ్జనం పురస్కరించుకుని కర్నూలు నగరంలో ఎకై ్సజ్ అధికారులు డ్రై డే ప్రకటించినప్పటికీ టానిక్ దుకాణం నుంచి రాత్రికి రాత్రే భారీగా మద్యాన్ని తరలించి రహస్యంగా నిల్వ చేసి విక్రయాలు జరుపుతూ ఎకై ్సజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులకు అడ్డంగా దొరికిపోయా రు. కర్నూలులోని బిర్లా కాంపౌండ్ రైల్వే గేటు వద్ద నివాసముంటున్న వెంకటేష్ ఇంట్లో అక్రమంగా భారీగా మద్యం నిల్వ ఉన్నట్లు ఎకై ్సజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులకు సమాచారం అందింది. గురువారం ఉదయం ఆ ప్రాంతంలో నిఘా వేసి వెంకటేష్ ఇల్లు గుర్తించి సోదాలు చేయడంతో ఒక్కొక్క బాక్సులో 48 బాటిళ్ల చొప్పున 6 బాక్సుల ఏపీ మద్యం, 5 బాక్సుల కర్ణాటక మద్యం పట్టుబడింది. పట్టుబడిన మద్యం ఏ లైసెన్స్‌డ్ షాపునకు చెందినదో అధికారులు ఎకై ్సజ్ యాప్ ద్వారా తెలుసుకున్నారు. పట్టుబడిన మద్యం బాటిళ్ల లేబుళ్లను స్కాన్ చేసి యాప్‌లో తనిఖీ చేయ గా ‘టానిక్’ దుకాణానికి సరఫరా చేసిన మద్యంగా బయటపడింది. అయితే ఆ దుకాణంపై కేసు నమో దు చేయడానికి అధికారులు తటపటాయిస్తున్నారు. ఆ దుకాణం అధికార పార్టీకి చెందిన నాయకులది కావడమే కారణమని తెలుస్తోంది.
అర్ధరాత్రి వరకు కొనసాగిన వ్యాపారం
గణేష్ నిమజ్జనం పురస్కరించుకుని ముందురోజు రాత్రి 10 గంటలకే కర్నూలు నగరంలో ఎకై ్సజ్ అధికారులు దుకాణాలు మూయించి సీల్ వేశారు. అయితే టానిక్ దుకాణంలో మాత్రం అర్ధరాత్రి వరకు వ్యాపారం సాగింది. ఎకై ్సజ్ అధికారులకు ఈ విషయం తెలిసినప్పటికీ అటువైపు కన్నెత్తి కూడా చూడలేదని మద్యం వ్యాపారుల్లో చర్చ జరుగుతోంది. సాధారణ రోజుల్లో టానిక్ దుకాణంలో రోజుకు రూ.8 లక్షల వరకు వ్యాపారం సాగుతోంది. అయితే బుధవారం అర్ధరాత్రి వరకు ‘టానిక్’లో విక్రయాలు జరిపినట్లు మద్యం వ్యాపారుల్లో చర్చ జరుగుతోంది. కర్నూలు నగరంలో 23 మద్యం దుకాణాలు ఉన్నాయి. డ్రై డే సందర్భంగా వాటిని మూయించడంతో టానిక్ దుకాణంలో రూ.30 లక్షలకు పైగా వ్యాపారం సాగినట్లు తోటి వ్యాపారుల్లో చర్చ జరుగుతోంది.
గతంలోనూ చర్యలు శూన్యం
బెల్టు షాపుల్లో పట్టుబడిన మద్యం ఏ దుకాణందో గుర్తిస్తే మొదటిసారి రూ.2 లక్షల జరిమానా, రెండోసారి పట్టుబడితే షాపు లైసెన్స్ రద్దు చేయాలి. జిల్లాలో బెల్టు షాపుల్లో మద్యం పట్టుబడిన కేసులు నమోదవుతున్నప్పటికీ ఇప్పటివరకు ఒక దుకాణానికి కూడా జరిమానా విధించింది కానీ, లైసెన్స్ రద్దు చేయడం కానీ జరగలేదు. ఇందుకు కారణం 90 శాతం దుకాణాలు అధికార పార్టీకి చెందిన వారివి కావడమే కారణమని ఎకై ్సజ్ అధికారులే అనధికారిక చర్చల్లో అంగీకరిస్తున్నారు.
మద్యం ప్రియులకు ఎలాంటి లోటు లేకుండా...
కొత్త మద్యం పాలసీ... 24 గంటలూ అందుబాటులో మద్యం... డ్రై డే కూడా మద్యం ప్రియులు మనసారా తాగేశారు. కర్నూలులో గణేష్ నిమజ్జన వేడుకలో మద్యం ప్రధాన భూమిక పోషించింది. నిషేధిత రోజు అయినప్పటికీ వ్యాపారులు ముందు రోజే మద్యాన్ని మరో ప్రాంతంలో నిల్వ చేసి మద్యం ప్రియులకు ఎలాంటి లోటు లేకుండా విక్రయాలు జరిపించారు. కర్నూలు నగరంలో 23 మద్యం దుకాణాలు ఉండగా అవి మూతపడినప్పటికీ అందులో పనిచేసే ఉద్యోగులు విక్రయాలు చేపట్టారు. ప్రధానంగా పాతబస్టాండ్, గాంధీ నగర్, బిర్లా జంక్షన్, చెన్నమ్మ సర్కిల్, సంతోష్ నగర్, నంద్యాల చెక్‌పోస్టు, సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం సమీపంలో ఉన్న దుకాణం వద్ద మద్యం విక్రయాలు జోరుగా సాగించారు. కోరిన మద్యం అందుబాటులో లభించడంతో మందుబాబులు ఊరేగింపులో పాల్గొని పలుచోట్ల శాంతిభద్రతలకు విఘాతం కలిగించారు.
‘టానిక్’ దుకాణం నిర్వాహకుడి
అక్రమ వ్యాపారం
కేసు నమోదుకు
తటపటాయిస్తున్న అధికారులు
దుకాణం టీడీపీ నాయకుడిది
కావడమే కారణం
6 బాక్సులు ఏపీ, 5 బాక్సుల
కర్ణాటక మద్యం సీజ్