
ఆపరేషన్ సింధూర్‌కు అంకితం
గణేష్ ఉత్సవాలకు రాష్ట్రంలోనే పేరుగాంచిన కర్నూలు నగరంలో గురువారం వినాయక నిమజ్జనం కనులపండువగా సాగింది. 45వ ఏడాది దాదాపు 1,700 విగ్రహాలతో నిర్వహించిన శోభాయాత్ర ఆఽధ్యాత్మిక ఆనందాన్ని పంచింది. కుల మతాలకు అతీతంగా నిర్వహించిన వేడుకను ఆపరేషన్ సింధూర్‌కు అంకితమివ్వడం విశేషం.
కర్నూలు కల్చరల్: తొమ్మిది రోజుల పాటు విశేష పూజలందుకున్న గణనాథుని నిమజ్జనోత్సవం గురువారం కర్నూలు నగరంలో కనుల పండువగా సాగింది. ఓల్డ్‌సిటీలోని రాంబొట్ల ఆలయం వద్ద నిమజ్జన శోభాయాత్ర పూజను జిల్లా కలెక్టర్ పి.రంజిత్‌బాషా, ఎస్పీ విక్రాంత్ పాటిల్, నంద్యాల పార్లమెంట్ సభ్యురాలు బైరెడ్డి శబరి, వీహెచ్‌పీ రాష్ట్ర అధ్యక్షుడు నందిరెడ్డి సాయిరెడ్డి, నగరపాలక సంస్థ కమిషనర్ విశ్వనాథ్, బీజేపీ జిల్లా అధ్యక్షుడు రామకృష్ణ ప్రారంభించారు. వేలాది భక్తుల హర్షధ్వానాల మధ్య శోభాయాత్ర ఆధ్యాత్మిక పరిమళాలను వెదజల్లింది. రాష్ట్రంలో ఎక్కడా లేనివిధంగా నగరం నడి మధ్యలో కేసీ కెనాల్‌లో విఘ్నేశ్వరునికి ఘనంగా వీడ్కోలు పలికారు. కేసీ కెనాల్‌కు ఇరువైపుల పది ఘాట్‌లలో ఏడు క్రేన్‌లు, స్టాంటన్ పురం మమతా నగర్ వద్ద ఘాట్‌లో ఒక క్రేన్‌తో, సంతోషనగర్ హైవే తుంగ భద్రా నది బ్రిడ్జి వద్ద నిమజ్జనం వైభవంగా నిర్వహించారు. వినాయక ఘాట్‌లో జ్యోతి ప్రజ్వలన, ధ్వజారోహణ, భరతమాత పూజ, వినాయక పూజలు చేసి కలెక్టరేట్ పరిపాలనా విగ్రహం, నగర పాలకం సంస్థ ఆధ్వర్యంలోని వినాయక విగ్రహాలతో నిమజ్జనం మొదలైంది. ఆర్‌ఎస్‌ఎస్ ప్రాంత సహ కార్యవాహక ఎం.శ్రీనివాసరెడ్డి ముఖ్య వక్తగా హాజరై సందేశమిచ్చారు. ప్రజలను సమైక్యం చేసేందుకే 1893లో బాల గంగాధర్ తిలక్ గణేష్ సామూహిక ఉత్సవాలను ప్రారంభించారన్నారు. దేవాలయాలు ఆధ్యాత్మిక శక్తి కేంద్రాలుగా నిలుస్తున్నాయన్నారు. కొందరు సనాతన ధర్మాన్ని అంతం చేస్తున్నారని గగ్గోలు పెడుతున్నారని.. అయితే అది అంత సులువు కాదన్నారు. నేటి తరానికి సనాతన ధర్మ, సంస్కృతి సంప్రదాయాలు తెలియజెప్పేందుకు వినాయక చవితి ఉత్సవాలు దోహదం చేస్తున్నాయన్నారు. సుమారు 1,700 విగ్రహాలు 2వేల మంది పోలీస్‌ల బందోబస్తు, 2వేల మంది స్వచ్ఛంద సేవకుల నడుమ వినాయక నిమజ్జనం ప్రశాంతంగా సాగింది.
సంప్రదాయబద్ధంగా శోభాయాత్ర
ఓల్డ్‌సిటీ కుమ్మరి వీధిలోని రాంబొట్ల ఆలయం వద్ద మొదటి విగ్రహానికి పూజలు నిర్వహించి శోభాయాత్రను ప్రారంభించారు. అక్కడ వినాయక లడ్డూ ప్రసాదానికి వేలం నిర్వహించగా నంద్యాల ఎంపీ బైరెడ్డి శబరి ఐదో ఏడాది రూ.6,01,000లకు దక్కించుకున్నారు. శోభా యాత్ర సంప్రదాయ బద్ధంగా మేళతాళాలు, డ్రమ్ములు, కోలాటాలు, కర్రల విన్యాసాలు, చెక్క భజనల నడుమ సాగింది. స్వామి వివేకానంద సంస్కృత పాఠశాల, కేశవ మెమోరియల్ పాఠశాల విద్యార్థుల ఘోష్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
సాంస్కృతిక కార్యక్రమాలు
చంద్రశేఖర శర్మ, కొట్టే చెన్నయ్య, ఎలమర్తి రమణయ్య, రామకృష్ణ శర్మ, యాగంటీశర్పప్ప, గురప్ప, గైరబోని వెంకటరాముడు వ్యాఖ్యాతలుగా వ్యవహరించారు. వినాయక ఘాట్ ప్రధాన వేదికపై పలు విద్యా సంస్థల విద్యార్థులు, సంగీత, నృత్య కళాశాలల విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ప్రత్యేకంగా నిలిచాయి. వినాయక్ ఘాట్‌లో అన్ని ప్రభుత్వ శాఖల అధికారులను సమన్వయం చేస్తూ ఏర్పాటు చేసిన కమాండ్ కంట్రోల్ రూమ్ ద్వారా వేడుకలను పర్యవేక్షించారు.
‘స్వచ్ఛంద’ సేవ
మాజీ ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్, మాజీ మంత్రి కేఈ ప్రభాకర్, కల్కి సేవా ట్రస్ట్ అన్నదాన కార్యక్రమాలు నిర్వహించారు. కార్పొరేటర్ సత్యనారాయణమ్మ ఆధ్వర్యంలో అల్పాహారం అందజేశారు. నగర పాలక సంస్థ, సత్యసాయి సేవా ట్రస్ట్, వీరశైవ సంఘం, భవసార క్షత్రియ సంఘం తదితర స్వచ్ఛంద సేవా సంస్థలు తాగునీరు, అన్నదానం నిర్వహించారు.
నృత్య నివేదన
వినాయక ఘాట్‌పై భరత నాట్యం చేస్తున్న చిన్నారి
దేదీప్యమానం: వినాయక ఘాట్ వద్ద హారతి ఇస్తున్న పండితులు
ప్రథమ పూజ్యం: నిమజ్జనోత్సవాన్ని ప్రారంభిస్తున్న ప్రజాప్రతినిధులు
ఐక్యతా భావం.. జాతీయ జెండాతో నృత్యం చేస్తున్న విద్యార్థినులు
‘మోత’ మోగించారు!
ప్రమాదకర స్థాయిలో డీజేలు
కర్నూలు(సెంట్రల్): వినాయక నిమజ్జనోత్సవంలో డీజే(డిస్క్‌జాక్) మ్యూజిక్ సిస్టమ్ మోత మోగింది. వీటితో పాటు అధిక శబ్ధ తరంగాలు విడుదల చేసే డ్రమ్స్, బాణసంచా పేలుళ్లతో నగరవాసుల చెవులకు చిల్లులు పడ్డాయి. ప్రతి వినాయక విగ్రహం ఊరేగింపు వాహనం ఎదుట డీజే సిస్టమ్ కోసం మరో ప్రత్యేక వాహనాన్ని ఏర్పాటు చేసుకోవడం గమనార్హం. సాధారణంగా 65 డెసిబుల్స్ శబ్ధం వరకు ఎలాంటి ప్రమాదం ఉండదు. అయితే గురువారం నిర్వహించిన నిమజ్జనోత్సవంలో 140 డెసిబుల్స్ వరకు శబ్ద కాలుష్యం చేరుకోవడంతో గందరగోళానికి తావిచ్చింది. ఇళ్లలో ఉన్న వాళ్లు శభ్దానికి ఎక్కడ కూలిపోతాయోనన్న భావన కలిగింది.
నగరంలో గురువారం వివిధ ప్రాంతాల్లో నమోదైన శబ్ధకాలుష్యం
ప్రాంతం శబ్ధకాలుష్యం
(సరాసరి) డీబీలు
కొండారెడ్డి బురుజు 110
రాజ్‌విహార్ 125
బుధవారపేట 135
కలెక్టరేట్ 136
వినాయక ఘాట్ 110
కర్నూలు నగరంలో
ఆధ్యాత్మిక పరవళ్లు
రాంబొట్ల దేవాలయం వద్ద తొలిపూజ
వందలాది విగ్రహాలతో
పండుగ వాతావరణం
ఆకట్టుకున్న సాంస్కృతిక కార్యక్రమాలు
కేసీ కెనాల్‌లో
కనుల పండువగా నిమజ్జనం
గట్టి పోలీసు బందోబస్తు మధ్య వీడ్కోలు
అడుగడుగునా
స్వచ్ఛంద సంస్థల సేవలు

ఆపరేషన్ సింధూర్‌కు అంకితం

ఆపరేషన్ సింధూర్‌కు అంకితం

ఆపరేషన్ సింధూర్‌కు అంకితం

ఆపరేషన్ సింధూర్‌కు అంకితం

ఆపరేషన్ సింధూర్‌కు అంకితం