డ్రోన్‌తో ఆరోగ్య పర్యవేక్షణ | - | Sakshi
Sakshi News home page

డ్రోన్‌తో ఆరోగ్య పర్యవేక్షణ

Sep 5 2025 5:30 AM | Updated on Sep 5 2025 5:30 AM

డ్రోన

డ్రోన్‌తో ఆరోగ్య పర్యవేక్షణ

● రూపొందించిన కర్నూలు ఐఐఐటీడీఎం

కర్నూలు(సెంట్రల్‌): అత్యవసర సమయాల్లో డ్రోన్‌ ద్వారా రోగుల ఆరోగ్యాన్ని పర్యవేక్షించేందుకు కర్నూలు ఐఐఐటీడీఎం రూపొందించిన ప్రత్యేక వ్యవస్థను జిల్లా కలెక్టర్‌ పి.రంజిత్‌బాషా పరిశీలించారు. గురువారం ఆయన తన క్యాంపు కార్యాలయంలో డ్రోన్‌ను పరిశీలించి పలు సూచనలు చేశారు. ఇన్‌బిల్ట్‌గా మైక్రోఫోన్‌, స్పీకర్‌, తక్కువ శబ్ధం కలిగిన ప్రొఫెల్లర్లతో డ్రోన్‌ను రూపొందించాలన్నారు. సాధ్యమైతే డ్రోన్‌ పరిమాణాన్ని మరింత తగ్గించి సామర్థ్యాన్ని పెంపొందించేందుకు చర్యలు చేపట్టాలన్నారు. కార్యక్రమంలో ట్రిపుల్‌ ఐటీడీఎం ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ కమ్యూనికేషన్‌ ఇంజినీరింగ్‌ విభాగం ప్రొఫెసర్‌ కె.కృష్ణ నాయక్‌, మెకానికల్‌ ఇంజినీరింగ్‌ విభాగం ప్రొఫెసర్‌ డాక్టర్‌ రవికుమార్‌, రాయలసీమ యూనివర్సిటీ ప్రొఫెసర్‌ ఖాసిఫా అంజుమ్‌ పాల్గొన్నారు.

వైఎస్సార్‌సీపీ జిల్లా మహిళా అధ్యక్షురాలుగా రేణుక

కర్నూలు (టౌన్‌): వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ జిల్లా మహిళా అధ్యక్షురాలుగా సిద్ధారెడ్డి రేణుకను నియమించారు. ఆమె కర్నూలు నగరపాలక సంస్థ డిప్యూటీ మేయర్‌గా గత నాలుగున్నర సంవత్సరాలుగా పనిచేస్తున్నారు. పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్న ఆమెకు జిల్లా అధ్యక్ష పదవి కేటాయించారు. అలాగే జిల్లా అధ్యక్షురాలిగా పనిచేస్తున్న శశికళ కృష్ణమోహన్‌ను రాష్ట్ర మహిళా విభాగం ప్రధాన కార్యదర్శిగా నియమించారు. ఈ మేరకు గురువారం రాత్రి పార్టీ కేంద్ర కార్యాలయం ఒక ప్రకటన విడుదల చేసింది.

15వ ఆర్థిక సంఘం నిధులు రూ.31.16 కోట్లు విడుదల

కర్నూలు(అర్బన్‌): జిల్లాలోని గ్రామ పంచాయతీలకు ఆరు నెలలు ఆలఽస్యంగా 15వ ఆర్థిక సంఘం నిధులు విడుదలయ్యాయి. 2024–25 ఆర్థిక సంవత్సరానికి 15వ ఆర్థిక సంఘం మొదటి విడత నిధులు గత ఏడాది నవంబర్‌లో విడుదలయ్యాయి. 2వ విడత నిధులు ఈ ఏడాది మార్చి నెలాఖరు నాటికి విడుదల కావాల్సి ఉంది. అయితే రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం స్థానిక సంస్థలకు విడుదల కావాల్సిన ఆర్థిక సంఘం నిధులను విస్మరించింది. వివిధ రూపాల్లో వినతులు, ఆందోళనలు చేపట్టిన నేపథ్యంలో ఎట్టకేలకు ఆరు నెలల ఆలస్యంగా జిల్లాలోని 482 గ్రామ పంచాయతీలకు రూ.31,16,31,031 విడుదలయ్యాయి. ఈ నేపథ్యంలోనే 2024–25 మొదటి విడత నిధులు విడుదల కాని ఐదు గ్రామ పంచాయతీలకు ( సాంబగల్లు, బాపులదొడ్డి, హెచ్‌ మురవణి, కంబాలదిన్నె, రాంపల్లి ) రూ.30,70,278 విడుదలయ్యాయి.

36 గ్రామాల్లో

రూ.11.52 కోట్లతో

పంచాయతీ భవనాలు

కర్నూలు(అర్బన్‌): జిల్లాలోని గ్రామ సచివాలయాలు లేని 36 గ్రామాల్లో రూ.11.52 కోట్లతో పంచాయతీ భవన నిర్మాణాలు మంజూరయ్యాయని పంచాయతీరాజ్‌ ఇంజనీరింగ్‌ వర్గాలు తెలిపాయి. ఒక్కో భవన నిర్మాణానికి రూ.32 లక్షలు వెచ్చించనున్నారు. ఇందులో రాష్ట్రీయ గ్రామీణ్‌ స్వరాజ్‌ అభియాన్‌ (ఆర్‌జీఎస్‌ఏ) రూ.25 లక్షలు, జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం నిధులు రూ.7 లక్షలతో ఈ పను లను చేపట్టనున్నారు. ఎన్‌ఆర్‌ఈజీఎస్‌ నియమ నిబంధనల మేరకు ఈ నిర్మాణాలను చేపట్టాలని ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు.

7న ఫారెస్టు అసిస్టెంట్‌ బీట్‌, సెక్షన్‌ ఆఫీసర్ల స్రీనింగ్‌ టెస్టు

కర్నూలు(సెంట్రల్‌): ఫారెస్టు శాఖలో భర్తీ చేయనున్న అసిస్టెంట్‌ బీట్‌ ఆఫీసర్‌, సెక్షన్‌ ఆఫీసర్‌ పోస్టులకు ఆదివారం(7వ తేదీ) స్క్రీనింగ్‌ టెస్టు ఆఫ్‌లైన్‌లో నిర్వహించనున్నట్లు ఏపీపీఎస్‌సీ జిల్లా కోర్డినేటర్‌, డీఆర్వో సి.వెంకట నారాయణమ్మ తెలిపారు. 13 జిల్లాల్లో 791 పోస్టుల భర్తీకి మొత్తం 1.30 లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా, ఉమ్మడి కర్నూలు జిల్లా నుంచి 12,920 మంది హాజరు కానున్నట్లు తెలిపారు. వీరందరికీ 13వ తేదీన కర్నూలులో స్క్రీనింగ్‌ టెస్టుకు 33 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. ఉదయం 10 నుంచి 12.30 గంటల వరకు అసిస్టెంట్‌ బీట్‌ ఆఫీససర్‌, మధ్యాహ్నం 3 నుంచి 5.30 గంటలకు సెక్షన్‌ ఆఫీసర్‌ పోస్టులకు స్క్రీనింగ్‌ టెస్టులను నిర్వహిస్తామన్నారు.

డ్రోన్‌తో ఆరోగ్య పర్యవేక్షణ 1
1/1

డ్రోన్‌తో ఆరోగ్య పర్యవేక్షణ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement