
● బలపంపై గురువులు
విద్యావేత్త సర్వేపల్లే రాధాకృష్ణణ్ జయంతి సందర్భంగా శుక్రవారం నిర్వహించే జాతీయ ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకొని పట్టణ చిత్రకారుడు చింతలపల్లె కోటేష్ బలపం ముక్కపై గురువుల సూక్ష్మ చిత్రాలను గీసి అబ్బుర పరిచారు. మైక్రో బ్రష్ ద్వారా గురువు గొప్ప తనాని బలపం ముక్కపై చూపించారు. చిత్రంలో త్రిమూర్తులైన బ్రహ్మ, విష్ణు, ఈశ్వరుడు.. ఈశ్వరుల స్వరూపమే గురువు అన్నట్లు సర్వేపల్లె రాధాకృష్ణన్‌ను చిత్రీకంచారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గురుబ్రహ్మ, గురువిష్ణు, గురుదేవో మహేశ్వరా, గురుసాక్షాత్ పరబ్రహ్మ తస్మైశ్రీ గురువేనమః అంటారన్నారు. – నంద్యాల(అర్బన్)