సి.బెళగల్: బురాన్‌దొడ్డి గ్రామ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో తెలుగు సబ్జెక్టును బోధిస్తున్న ముతుకూరి గోపాలచార్యులు రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయుడిగా ఎంపికయ్యారు. ఆయనను ఎంఈఓలు జ్యోతి, ఆదామ్‌బాషా, పాఠశాల హెచ్‌ఎం అబ్దుల్ హకీమ్, పాఠశాలలో సహచర ఉపాధ్యాయులు అభినందించారు. ముతుకూరి గోపాలచార్యులు స్వగ్రామం గోరంట్ల కాగా.. వీరి తండ్రి ఎంవీ రమణాచార్యులు ప్రసిద్ధ కవి. వీరి కుటుంబంలో ఆరుగురు ఉపాధ్యాయులు పనిచేయడం మరో విశేషం. ముతుకూరి గోపాలచార్యులు ఎంటెక్ పూర్తి చేసి హెచ్‌ఎంటీ లిమిటెడ్‌లో జీఎంగా (జనరల్ మేనేజర్‌గా) పని చేసేవారు. సర్వీస్ ఉన్నప్పటికీ దానిని వదిలేసి, ఎంఏ తెలుగు, టీపీటీ, ఎంఏ సంస్కృతం పూర్తి చేసి 2003లో ఉపాధ్యాయ వృత్తిలోకి ప్రవేశించారు. . విద్యార్థులకు అర్ధమయ్యే రీతిలో పాఠాలను బోధించి రాష్ట్ర స్థాయి ఉత్తమ ఉపాధ్యాయుడిగా ఎంపిక అయ్యారు.