గాంధీనగర్(విజయవాడసెంట్రల్): మాషా అల్లా ఎంటర్ ప్రైజెస్ సంస్థను నమ్మి మోసం పోయామని, తమను ఆదుకోవాలని బాధితులు ప్రభుత్వాన్ని వేడుకున్నారు. విజయవాడ ప్రెస్‌క్లబ్‌లో బాధితులు మంగళవారం మీడియాతో మాట్లాడారు. మచిలీపట్నంనకు వాణి మాట్లాడుతూ.. మాషా అల్లా ఎంటర్ ప్రైజెస్‌పై కేసు పెట్టామని, అయితే దర్యాప్తు సమాచారం పోలీసుల నుంచి రావడం లేదన్నారు. తమకు త్వరగా న్యాయం చేయాలని సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్, పవన్ కళ్యాణ్, హోం మంత్రి అనిత వేడుకుంటున్నామన్నారు. బాధ్యులను పక్కన బెట్టి బాఽధితుల బ్యాంక్ ఖాతాలను పోలీసులు ఫ్రీజ్ చేయిస్తున్నారని ఆందోళన వ్యక్తంచేశారు. ఫలితంగా సొంత అవసరాలకు బ్యాంకుల్లో డబ్బు వాడుకోవడానికి కుదరడం లేదన్నారు. మరో బాధితుడు సురేష్ మాట్లాడుతూ.. సంస్థ బోర్డు తిప్పేసిన తర్వాత సీఎం, హోం మంత్రిని కలిశామన్నారు. పోలీసులు మీడియా సమావేశం ఏర్పాటు చేసి అన్ని విషయాలు బహిర్గతం చేయాలని కోరారు.


