లబ్బీపేట(విజయవాడతూర్పు): పేద ప్రజల ఆరోగ్యంపై చంద్రబాబు ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని వైఎస్సార్ సీపీ వైద్య విభాగం రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ మెహబూబ్ షేక్ విమర్శించారు. 16 రోజులుగా జూనియర్ డాక్టర్లు సమ్మె చేస్తుంటే, వారితో చర్చించి సమస్య పరిష్కరించాల్సిన ప్రభుత్వం చోద్యం చూస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. నగరంలోని తన కార్యాలయంలో మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఇప్పటికే ఆరోగ్యశ్రీ, 104 సేవలను అటకెక్కించిన ముఖ్యమంత్రి చంద్రబాబు, ఇప్పుడు జూడాల సమ్మెతో బోధనాస్పత్రిల్లో వైద్యం అందకుండా చేస్తున్నారని విమర్శించారు. అత్యవసర సేవలను సైతం జూడాలు బహిష్కరించడంతో ప్రభుత్వాస్పత్రుల్లో వైద్యం అందక రోగులు ఇబ్బందులు పడుతున్నారని ఆందోళన వ్యక్తంచేశారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి జూడాల సమస్యను పరిష్కరించాలని సూచించారు.
వైఎస్సార్ సీపీ వైద్య విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షుడు డాక్టర్ మెహబూబ్ షేక్


