బుధవారం శ్రీ 26 శ్రీ ఆగస్టు శ్రీ 2026 ప్రైవేటుకు ప్రసాదం! బాధ్యతల నుంచి తప్పుకుంటున్న ఇంద్రకీలాద్రి దేవస్థానం దుర్గగుడిలోకి ‘ప్రైవేటు’ అడుగులు పడుతున్నాయి. రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా భక్తులు భక్తితో స్వీకరించే అమ్మ ప్రసాదం అందించే బాధ్యతను ప్రైవేటుకు అప్పగించేందుకు తెర వెనుక ప్రయత్నాలు ముమ్మరంగా సాగుతున్నాయి. దేవస్థానం ఆ బాధ్యతల నుంచి తప్పుకొని ప్రైవేటుకు అప్పనంగా అప్పగించేందుకు మంగళగిరి నుంచి కథ నడిపిస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. అనుబంధానికి ‘రాఖీ’ ముడి u8లో సాక్షి ప్రతినిధి, విజయవాడ: ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న దుర్గమ్మ సన్నిధిలో అన్నప్రసాదం అంటే మహా ప్రసాదమనే భావన భక్తుల్లో ఉంది. తమకు ఏ చిన్న పాటి మంచి జరిగినా, తమ ఇంట ఏ శుభకార్యం జరిగినా అంతా అమ్మవారి దయే అనే భావనతో భక్తులు అమ్మవారిని దర్శించుకుంటారు. తమకు తోచిన రీతిలో అన్నదానానికి విరాళాలను సమర్పిస్తుంటారు. ప్రతి నెలా దేవస్థానానికి అన్నదానం నిమిత్తం రూ.లక్షల్లో విరాళాలు అందుతుంటాయి. ఇవే కాకుండా అమ్మవారి అన్న ప్రసాదం స్వీకరించిన భక్తులు తమ లాంటి వారు మరి కొందరు అమ్మవారి అన్న ప్రసాదం స్వీకరించాలనే ఆశయంతో అన్నప్రసాదం స్వీకరించిన తర్వాత వారికి తోచిన మొత్తంలో విరాళాలు అందజేస్తూ ఉంటారు. ఇంతటి మహత్తరమైన అమ్మవారి అన్న ప్రసాదాన్ని తయారు చేసే బాధ్యతల నుంచి దేవస్థానం తప్పుకుని ఇతర ప్రైవేటు సంస్థలు అప్పగించాలనే ప్రయత్నాలు జరుగుతున్నాయి. దీనికి మంగళగిరి నుంచి కథ నడుస్తోందన్న ప్రచారం సాగుతోంది.
మిషనరీ కొనుగోలుకు రూ. 1.95కోట్లు
శ్రీదుర్గా మల్లేశ్వర స్వామి దేవస్థానంలో అన్నదానం నిమిత్తం ఈ నెల 21వ తేదీన రూ. 26కోట్లతో నిర్మించిన అన్నప్రసాద భవనంలో మిషనరీ ఏర్పాటు చేసే బాధ్యత ఇస్కాన్ సంస్థకు అప్పగించారు. ఇందు కోసం దేవస్థానం అన్నదానం ట్రస్ట్ నుంచి రూ. 1.95కోట్లు చెల్లించాలని, ఆ స్వచ్ఛంద సంస్థ మిషనరీ ఏర్పాటుకు ఎటువంటి టెండర్లు లేకుండానే పనులు అప్పగించాలని ప్రభుత్వ కార్యదర్శి నుంచి ఆదేశాలు దేవస్థానానికి అందాయి. అయితే దీనికి దేవదాయ శాఖ కమిషనర్ అనుమతులు కావాల్సి ఉంటుందని ఆలయ అధికారులు పేర్కొంటున్నారు. మరో వైపున అన్నదానం ట్రస్ట్ నుంచి నిధులు ఖర్చు చేయడం అంటే అంత ఆషామాషీ వ్యవహారం కాదు. ఈ మిషనరీ ఏర్పాటు చేయడం ఒక్కటే ఈ స్వచ్ఛంద సంస్థ పని కాదు.. మిషనరీ ఏర్పాటు చేసిన తర్వాత ఐదేళ్ల పాటు వాటి పని తీరును ఈ సంస్థే పర్యవేక్షిస్తోంది. ఒకవేళ మిషనరీ వినియోగించడంలో దేవస్థాన సిబ్బంది వైఫల్యం చెందితే అన్నదానం బాధ్యతలను ఈ సంస్థే నిర్వహించాలని భావిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.
రూ. 6కోట్ల అదనపు భారం..
ప్రస్తుతం దుర్గగుడి దేవస్థానం ప్రతి రోజు 8వేల మందికి అన్నదానం జరుపుతోంది. ఇందు కోసం ఒక ప్లేట్ భోజనానికి కూరగాయల ధరలు బాగా ఎక్కువగా ఉన్న సమయంలో కూడా రూ. 40 నుంచి రూ. 45 కంటే ఎక్కువ ఖర్చు కాదు. అయితే మిషనరీ ఏర్పాటు చేయడానికి ముందుకు వచ్చిన ఈ సంస్థ అమ్మవారి అన్న ప్రసాదం తయారు చేసి భక్తులకు పంపిణీ చేయాలంటే ఒక్కో ప్లేట్‌కు రూ.65కు చెల్లించేలా అంతర్గతంగా ఒప్పందాలు జరుగుతున్నాయనే ప్రచారం జరుగుతోంది.
ఇదే జరిగితే దుర్గగుడిపై ఏడాదికి సుమారు ఆరు కోట్ల రూపాయలు అదనంగా భారం పడే అవకాశం ఉంది. ఈ వ్యవహారంలో దేవస్థానానికి చెందిన ఇంజినీరింగ్ అధికారితో పాటు దేవస్థానానికి చెందిన మరో కీలక వ్యక్తి ప్రముఖ పాత్ర వహిస్తున్నట్లు సమాచారం. ఈ వ్యవహారాన్ని చక్కబెట్టడం ద్వారా మంగళగిరి ముఖ్యనేత దగ్గర మంచి మార్కులు కొట్టేసి, రెండు, మూడు నెలల్లో తనకు వచ్చే ప్రమోషన్ ద్వారా మంచి పోస్టు సాధించుకోవాలనేది ఈ అధికారి భావిస్తున్నట్లు చెబుతున్నారు.
బీమా దడఖాస్తు!
న్యూస్‌రీల్
ఇస్కాన్‌కు అప్పగించేందుకు తెర వెనుక ప్రయత్నాలు దేవస్థానంపై ఏడాదికి రూ.6కోట్ల వరకు భారం కుకింగ్ మిషనరీ కొనుగోలుకు టెండర్లు లేకుండా అనుమతి రాష్ట్రంలో ఎక్కడా లేని వింత పోకడ మంగళగిరి నుంచి కదులుతున్న ఫైల్ ఐదేళ్ల పాటు వారిదే బాధ్యతట?
రాష్ట్రంలో ఎక్కడా లేదే!
దుర్గగుడిలో అన్నదాన భవనంలో మిషనరీ ఏర్పాటు, పర్యవేక్షణపై స్వచ్ఛంద సంస్థ చూపుతున్న చొరవ రాష్ట్రంలో ఏ దేవస్థానంలోనూ లేదు. నిత్యం వేలాది మంది భక్తులకు అన్న ప్రసాదం పంపిణీ చేసే తిరుమల తిరుపతి దేవస్థానంలోనే అన్న ప్రసాదం సిద్ధం చేయడం, పంపిణీ చేయడం దేవస్థానమే చేస్తుంది. మరీ ఎక్కడా లేని విధానాన్ని దుర్గగుడిలో అమలు చేసేందుకు పాలకులు ఎందుకు ఉత్సాహం చూపుతున్నారనేది తెలియాల్సి ఉంది.
ఏఐ రోబోటిక్స్‌పై ఆసక్తి..
దుర్గమ్మ సేవలో..
నిమ్మ ధరలకు రెక్కలు
కృష్ణాజిల్లా
బుధవారం శ్రీ 26 శ్రీ ఆగస్టు శ్రీ 2026
బాధ్యతల నుంచి తప్పుకుంటున్న ఇంద్రకీలాద్రి దేవస్థానం
దుర్గగుడిలోకి ‘ప్రైవేటు’ అడుగులు పడుతున్నాయి. రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా భక్తులు భక్తితో స్వీకరించే అమ్మ ప్రసాదం అందించే బాధ్యతను ప్రైవేటుకు అప్పగించేందుకు తెర వెనుక ప్రయత్నాలు ముమ్మరంగా సాగుతున్నాయి. దేవస్థానం ఆ బాధ్యతల నుంచి తప్పుకొని ప్రైవేటుకు అప్పనంగా అప్పగించేందుకు మంగళగిరి నుంచి కథ నడిపిస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.
అనుబంధానికి ‘రాఖీ’ ముడి
7
మొగల్రాజపురంలోని పీబీ సిద్ధార్థ కళాశాలలో ఎలక్ట్రానిక్స్ అండ్ ఏఐ విభాగాలు సంయుక్తంగా ఏఐ హ్యూమనైడ్ రోబోటిక్స్‌పై మంగళ వారం వర్క్‌షాప్ నిర్వహించాయి.
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): దుర్గమ్మను సినీ నటి ఐశ్వర్య రాజేష్ మంగళవారం రాత్రి దర్శించుకున్నారు. అనంతరం వేద పండితులు ఆశీర్వచనం అందజేశారు.
నిమ్మకాయ ధరలకు రెక్కలొచ్చాయి. నిన్న మొన్నటి వరకు అర డజను కాయలు రూ.10కే దొరికేవి. ఇప్పుడు ఒక్క కాయ ధర రూ.10 పలుకుతోంది.