రాష్ట్రంలో సద్దుల సంబురాన్ని ఒక్కో ప్రాంతంలో ఒక్కో రకంగా జరుపుకుంటుంటారు. కరీంనగర్, జగిత్యాల, వరంగల్ వంటి ప్రాంతాల్లో దసరాకు ముందే బతుకమ్మలను సాగనంపుతారు. ఆదిలాబాద్‌లో మాత్రం కోజాగిరి పౌర్ణమి వరకు వేడుకలు కొనసాగించడం ఆనవాయితీ. చంద్రుడిని పాలలో చూసిన అనంతరం బతుకమ్మలను నిమజ్జనానికి తీసుకువెళ్తారు. ఇందులో భాగంగా జిల్లాకేంద్రంలో ఆదివారం రాత్రి రేయిరాజు(చంద్రుడి)ను దర్శించుకుని, జాబిలి వెలుగులో అర్ధరాత్రి వరకు మహిళలు బతుకమ్మ వేడుకల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు. – ఆదిలాబాద్


