ఆసిఫాబాద్‌అర్బన్: ఎల్‌నినో ప్రభావంతో ఏర్పడుతున్న కరువు పరిస్థితులను ఎదుర్కోవడంలో కాంగ్రెస్ విఫలమైందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ ఆరోపించారు. జిల్లా కేంద్రంలోని రోజ్‌గార్డెన్‌లో గురువారం ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. రాష్ట్రం మొత్తాన్ని కరువు ప్రాంతంగా ప్రకటించి రైతులకు పంట నష్ట పరిహారం అందించాలని డిమాండ్ చేశారు. కేంద్రం నుంచి నిధులు సాధించేందుకు అఖిల పక్షాన్ని ప్రభుత్వం ఢిల్లీకి తీసుకెళ్లాలని సూచించారు. బీజేపీ కేంద్ర మంత్రులు, ఎమ్మెల్యేలు స్పందించాలన్నారు. సీపీఎం రాష్ట్ర నాయకులు భూపాల్ మాట్లాడుతూ ఎస్పీఎం కా ర్మికులు 130 రోజులుగా సమ్మె చేస్తున్నా యాజమాన్యం, ప్రభుత్వం స్పందించడం లేదన్నారు. సమావేశంలో సీపీఎం జిల్లా కార్యదర్శి కూశన రాజన్న, నాయకులు బండారు రవికుమార్, దుర్గం దినకర్, శ్రీనివాస్, కార్తీక్, రాజేందర్, ఆనంద్, కృష్ణమాచారి, టీకానంద్ తదితరులు పాల్గొన్నారు.


