ఆసిఫాబాద్‌అర్బన్: రాష్ట్రంలోని అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీల వైఫల్యాలను ఎత్తి చూపేందుకే ఇంద్రవెల్లి సభ నిర్వహిస్తున్నట్లు టీఆర్ఎస్ బెల్లంపల్లి ఇన్చార్జి, మాజీ మంత్రి బోడ జనర్దన్ అన్నారు. జిల్లా కేంద్రంలోని ఆ పార్టీ కార్యాలయంలో గురువారం జిల్లా అధ్యక్షుడు కిరిమిల్ల వినోద్ అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. ఇంద్రవెల్లి సభలో పీసీసీ అధ్యక్షుడి హోదాలో రేవంత్‌రెడ్డి ఇచ్చిన ఒక్క హామీ నెరవేరలేదన్నారు. ఆసిఫాబాద్– ఆదిలాబాద్ రహదారి, ఘాట్‌రోడ్డు కనీస అభివృద్ధికి నోచుకోలేదని పేర్కొన్నారు. ఇంత జరుగుతున్నా బీఆర్ఎస్ ప్రశ్నించకపోవడం విడ్డూరంగా ఉందని తెలి పారు. ఇంద్రవెల్లిలో శుక్రవారం నిర్వహించే పాంచజన్య సభకు ప్రజలు హాజరై విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. సిర్పూర్ నియోజకవర్గ ఇన్చార్జి కావేటి సబిత, జిల్లా ప్రధాన కార్యదర్శి అశోక్, ఆర్గనైజింగ్ సెక్రెటరీ మనోహర్, నాయకులు కిషన్‌నాయక్, శ్యాంరావు తదితరులు పాల్గొన్నారు.


