సింగరేణిలో గోలేటి సీహెచ్‌పీకి ప్రత్యేక స్థానం | - | Sakshi
Sakshi News home page

సింగరేణిలో గోలేటి సీహెచ్‌పీకి ప్రత్యేక స్థానం

Oct 30 2026 12:39 AM | Updated on Oct 30 2026 12:39 AM

రెబ్బెన: సింగరేణిలో బెల్లంపల్లి ఏరియా గోలేటి సీహెచ్‌పీకి ప్రత్యేక స్థానం ఉందని జనరల్‌ మేనేజర్‌ శ్రీ రమేశ్‌ తెలిపారు. సీహెచ్‌పీలో గురువారం (స్వచ్ఛత) స్పెషల్‌ కాంపెయిన్‌ 6.0 కార్యక్రమాన్ని నిర్వహించారు. అధికారులు, ఉద్యోగులతో కలిసి సీహెచ్‌పీ ఆవరణలో మొక్కలు నాటారు. అనంతరం ఆ యన మాట్లాడుతూ జాతీయ రహదారి మీదుగా పర్యవరణ హితంగా బొగ్గు రవాణా సాగుతుందన్నారు. అత్యధిక రేకుల బొగ్గు రవాణా చేసిన రికా ర్డు, స్వచ్ఛతలో దేశవ్యాప్తంగా గోలేటి సీహెచ్‌పీ ఉత్త మ అవార్డులు సొంతం చేసుకోవడం గర్వకారణమ ని పేర్కొన్నారు. సీహెచ్‌పీ ఆవరణను మరింత ప చ్చదనంతో తీర్చిదిద్దేందుకు అధికారులకు సూచనలు చేశారు. ఏఐటీయూసీ నాయకులు అదం సమీ, ఏరియా ఇంజినీర్‌ వీరన్న, ఎస్వోటూజీఎం స్వామి రాజు, సీహెచ్‌పీ హెచ్‌వోడీ కోటయ్య, సీనియర్‌ పర్సనల్‌ అధికారి శ్రీనివాస్‌, ఏఐటీయూసీ ఫిట్‌ కార్యదర్శి రామయ్య, ఎన్విరాన్‌మెంట్‌ అధికారి జైపాల్‌ యాదవ్‌, ఫారెస్టు అధికారి సుష్మలక్ష్మి, వర్క్‌మెన్‌ ఇన్‌స్పెక్టర్‌ సంతోష్‌కుమార్‌ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement