ఆసిఫాబాద్‌రూరల్: జిల్లా కేంద్రంలోని ప్రభు త్వ జూనియర్ కళాశాల విద్యార్థినులు రాష్ట్రస్థాయి జూనియర్ బాలికల హ్యాండ్‌బాల్ పోటీలకు ఎంపికయ్యారని డీఎస్వో షేకు, ప్రిన్సిపాల్ రాందాస్ తెలిపారు. కళాశాల ఆవరణలో గురువారం కోచ్‌లు అరవింద్, తిరుమల్, రాకేశ్, వైస్ ప్రిన్సిపాల్ శ్రీనివాస్‌తో కలిసి అభినందించారు. ఉమ్మడి జిల్లాస్థాయి పోటీల్లో ప్రతిభ చూపిన కవిత, నందిని, శిరీ ష, లక్ష్మి, జ్యోతికళ, ధనలక్ష్మి, అనూష రాష్ట్రస్థా యికి ఎంపికయ్యారని తెలిపారు. వీరు ఈ నెల 31 నుంచి నవంబర్ 2 వరకు ఖమ్మంలో జరిగే రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొంటారన్నా రు. కాగా, ఈ విద్యార్థినులు ప్రభుత్వ కళాశాలలో చదువుతూ గిరిజన పోస్ట్‌మెట్రిక్ హాస్టల్లో ఉంటున్నారు. ఆదర్శ క్రీడాపాఠశాల కోచ్‌ల వద్ద శిక్షణ తీసుకుంటున్నారు.


