గాడితప్పిన ‘లీజు’ వ్యాపారం! | - | Sakshi
Sakshi News home page

గాడితప్పిన ‘లీజు’ వ్యాపారం!

Oct 29 2026 12:18 AM | Updated on Oct 29 2026 12:18 AM

● దుకాణం ఒకరిది.. వ్యాపారం మరొకరిది ● మున్సిపల్‌ ఆదాయానికి గండి

ఆసిఫాబాద్‌అర్బన్‌: ఆసిఫాబాద్‌ మున్సిపాలిటీ పరిధిలో అద్దె వ్యాపారం గాడితప్పుతోంది. కొంద రు యజమానులు మున్సిపల్‌కు తక్కువ అద్దె చెల్లి స్తూ ఇతరులకు ఎక్కువ మొత్తానికి అద్దెకు ఇస్తున్నా రు. ఓ వైపు వారు అదనపు ఆదాయం పొందుతుండగా, మున్సిపాలిటి ఆదాయానికి మాత్రం గండిపడుతోంది. మరికొందరు ఏకంగా మున్సిపల్‌ స్థలా ల్లోనే టేలాలు వేసి అద్దెకు ఇస్తూ ఆదాయం అర్జిస్తున్నారు. ఈ లెక్కన బల్దియాకు నెలకు సుమారు రూ.లక్ష వరకు వరకు నష్టం జరుగుతోంది. నిబంధనల ప్రకారమైతే అద్దె తీసుకున్న దుకాణాలు నిర్వహించలేని పరిస్థితులు ఉంటే తిరిగి అప్పగించాలి. అధికారులు వాటికి మళ్లీ టెండర్లు నిర్వహిస్తారు. కానీ కొందరు వ్యాపారులు మాత్రం దుకాణాలను బినామీలకు అప్పగిస్తున్నారు. వారి నుంచి కొంత అద్దె వసూలు చేస్తున్నారు.

జిల్లా కేంద్రంలో ఇలా..

ఆసిఫాబాద్‌ మున్సిపల్‌ పరిధిలో మూడు దుకాణ సముదాయాలు ఉన్నాయి. ఇందులో 41 గదులు అద్దె ప్రాతిపదికన కొనసాగుతున్నాయి. నెలకు రూ.1.90 లక్షల వరకు అద్దె బల్దియాకు సమకూరుతోంది. అలాగే 200కు పైగా టేలాలు మున్సిపల్‌ స్థలాల్లోనే కొనసాగుతున్నాయి. వీటి ద్వారా నెలకు రూ.1.50 లక్షల వరకు ఆదాయం వస్తోంది. మున్సిపల్‌ అద్దె నామమాత్రంగా రూ.500 నుంచి రూ.600 వరకే ఉంది. కానీ మున్సిపల్‌ నుంచి అద్దెకు తీసుకున్న వారు చాలా మంది ఇతరులకు రూ.4వేల నుంచి రూ.10వేల వరకు అధిక ధరకు మళ్లీ రెంట్‌కు ఇచ్చినట్లు ఆరోపణలు ఉన్నాయి. అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని పట్టణ ప్రజలు కోరుతున్నారు.

నోటీసులు జారీ చేస్తాం

మున్సిపల్‌ సముదాయంలో సబ్‌ లీజుల వ్యవహారం మా దృష్టికి వచ్చింది. త్వరలోనే వారికి నోటీసులు జారీ చేస్తాం. బినామీలను తొలగించి అర్హులైన అందించేందుకు చర్యలు చేపడతాం. అక్రమాలు జరిగితే అధికారుల దృష్టికి తీసుకురావాలి.

– అంజయ్య, ఆసిఫాబాద్‌ మున్సిపల్‌ కమిషనర్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement