‘ఓడీల వివరాలు అడగడం సరికాదు’ | - | Sakshi
Sakshi News home page

‘ఓడీల వివరాలు అడగడం సరికాదు’

Oct 29 2026 12:18 AM | Updated on Oct 29 2026 12:18 AM

ఆసిఫాబాద్‌రూరల్‌: ఉపాధ్యాయుల ఆన్‌డ్యూటీ(ఓడీ)ల వివరాలను అడగడం సరికాదని, సంబంధిత ఆదేశాలను వెంటనే ఉపసంహరించుకోవాలని పీఆర్‌టీయూ నాయకులు కోరారు. ఈ మేరకు జిల్లా కేంద్రంలో బుధవారం డీఈవో సచ్చిదానంద చారికి వినతిపత్రం అందించారు. ఆ సంఘం జిల్లా అధ్యక్షుడు ప్రకాశ్‌ మాట్లాడుతూ జిల్లాలో పనిచేస్తున్న ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయులు శిక్షణ తరగతులు, సమావేశాలు, ఇతర పనులకు వెళ్లిన సమయంలో ఎఫ్‌ఆర్‌ఎస్‌ ఆన్‌డ్యూటీగా నమోదు చేస్తారని తెలిపారు. తర్వాత హెచ్‌ఎంలు, డీడీవోలు పరిశీలించి ధ్రువీకరిస్తారని స్పష్టం చేశారు. కానీ రాష్ట్రంలో ఎక్కడా లేనివిధంగా 300 మంది టీచర్ల ఓడీ వివరాలు ఇవ్వాలని విద్యాశాఖ ఆదేశించడం సరికాదన్నారు. కార్యక్రమంలో నాయకులు రమేష్‌, చారి, అనిల్‌కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement