ఆయిల్‌పాం సాగుతో అధిక లాభాలు | - | Sakshi
Sakshi News home page

ఆయిల్‌పాం సాగుతో అధిక లాభాలు

Oct 29 2026 12:18 AM | Updated on Oct 29 2026 12:18 AM

దహెగాం: ఆయిల్‌పాం సాగుతో రైతులు అధి క లాభాలు పొందవచ్చని ఉద్యానవన శాఖ అధికారి సుప్రజ అన్నారు. మండలంలోని ఐనం గ్రామ శివారులో కొత్తగా నాటిన ఆయిల్‌పాం మొక్కలను బుధవారం పరిశీలించారు. ఉద్యానవన శాఖ ఆధ్వర్యంలో ఆయిల్‌పాం మొక్కలను 90 శాతం సబ్సిడీతో అందిస్తున్నామని తెలిపారు. మొక్కలు నాటిన నాలుగేళ్ల వరకు ఎకరానికి రూ.4,200 నిర్వహణ ఖర్చులు అందిస్తామన్నారు. ఈ సందర్భంగా రైతులకు మొక్కల సంరక్షణ చర్యలను వివరించారు. కార్యక్రమంలో వాల్యూ ఆయిల్‌ ఏరియా మేనేజర్‌ గౌతమ్‌ రమేశ్‌, ఫినోలిక్‌ ఇరిగేషన్‌ జిల్లా కోఆర్డినేటర్‌ కిరణ్‌, ఫీల్డ్‌ ఎక్సిక్యూటివ్‌ ఫరూక్‌ ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement