స్థానికంగా ఉపాధి కల్పించాలి | - | Sakshi
Sakshi News home page

స్థానికంగా ఉపాధి కల్పించాలి

Oct 29 2026 12:18 AM | Updated on Oct 29 2026 12:18 AM

ఆసిఫాబాద్‌అర్బన్‌: వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో ఇతర ప్రాంతాలకు వలస వెళ్లకుండా రైతులు, ప్రజలకు వీబీ జీ రామ్‌జీ పథకం కింద స్థానికంగానే ఉపాధి పనులు కల్పించాలని రాష్ట్ర పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి సీతక్క అన్నారు. హైదరాబాద్‌ నుంచి బుధవారం పంచాయతీరాజ్‌ శాఖ ప్రత్యేక కార్యదర్శి దాన కిశోర్‌, సెర్ప్‌ సీఈవో దివ్య దేవరాజన్‌తో కలిసి వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా కలెక్టర్లు, డీఆర్‌డీవోలు, ఎంపీడీవోలతో వీబీ జీ రామ్‌జీ పథకం అమలు, ఎల్‌నినో ప్రభావాన్ని తగ్గించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై సమీక్ష సమావేశం నిర్వహించారు. మంత్రి మాట్లాడుతూ రైతులు పశువులకు అవసరమైన పచ్చిగడ్డి సాగు చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. వీబీ జీ రామ్‌జీ పథకం కింద అనుమతించిన 375 రకాల పనులపై సర్పంచులకు అవగాహన కల్పించి, పనిదినాలు పెరిగేలా చూడాలని ఆదేశించారు. ఆదర్శ గ్రామంగా ఎంపికైతే కేంద్ర ప్రభుత్వం రూ.కోటి చెల్లిస్తుందని తెలిపారు. రైతులు, గ్రామ సంఘాల ఆధ్వర్యంలో పశుగ్రాసం సాగు చేస్తే ఎకరానికి రూ.14వేల ఆర్థికసాయం అందిస్తామని ప్రకటించారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్‌ నుంచి అదనపు కలెక్టర్‌ యువరాజ్‌ మర్మాట్‌ మాట్లాడారు. జిల్లాలోని చెరువులు, కాలువల్లో పూడికతీత పనులు చేపట్టేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఇప్పటికే ప్రారంభించిన గ్రామ సంఘాల భవనాలు, అదనపు గదులు, అంగన్‌వాడీ కేంద్రాలు, పంచాయతీ భవనాలు గడువులోగా పూర్తి చేస్తామని వివరించారు. వీబీ జీ రామ్‌ జీ పథకం కింద పనిదినాలు పెంచేందుకు తగిన సంఖ్యలో మేట్లను నియమిస్తామని పేర్కొన్నారు. నీటి తొట్లు ఏర్పాటు చేయడంతోపాటు పశుగ్రాసం సాగు ప్రోత్సహిస్తామని, నీటి సంరక్షణలో భాగంగా వ్యక్తిగత, సామూహిక ఇంకుడు గుంతల నిర్మాణానికి చర్యలు తీసుకుంటామని తెలిపారు. సమావేశంలో డీఆర్‌డీవో దత్తారావు, జెడ్పీ సీఈవో లక్ష్మీనారాయణ, డీపీవో భిక్షపతిగౌడ్‌, డీఎల్‌పీవో ఉమర్‌ హుస్సేన్‌, అధికారులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement