కొండచిలువ కలకలం | - | Sakshi
Sakshi News home page

కొండచిలువ కలకలం

Oct 27 2026 12:26 AM | Updated on Oct 27 2026 12:26 AM

బోథ్‌: మండలకేంద్రంలోని ఫ్రెండ్స్‌ క్లబ్‌ ఆవరణలో సోమవారం కొండచిలువ కలకలం రేపింది. క్లబ్‌ మైదానంలో కొందరు యువకులు వాలీబాల్‌ ఆడిన అనంతరం, అక్కడే నిర్మిస్తున్న భవనంలో మాట్లాడుకుంటుండగా ఒక్కసారిగా కనిపించింది. వారంతా భయపడి పరుగులు తీశారు. కొండచిలువను కొందరు సెల్‌ఫోన్లలో ఫొటోతీశారు. కాసేపటికే అది సమీపంలోని పొదల్లోకి వెళ్లి కనిపించకుండా పోయింది. అయితే, ఫ్రెండ్స్‌ క్లబ్‌ వెనుక భాగంలో నివాస గృహాలు ఉన్నాయని, అటవీ అధికారులు కొండచిలువను బంధించి అడవిలో వదిలిపెట్టాలని స్థానికులు కోరుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement