‘పార్ట్‌– 2’ పంపిణీ షురూ | - | Sakshi
Sakshi News home page

‘పార్ట్‌– 2’ పంపిణీ షురూ

Oct 24 2026 11:47 PM | Updated on Oct 24 2026 11:47 PM

● జిల్లా కేంద్రం నుంచి మండలాలకు పాఠ్యపుస్తకాలు తరలింపు ● జిల్లాలో 49,100 మంది విద్యార్థులు

కెరమెరి: దసరా సెలవుల అనంతరం పాఠశాలలు పునఃప్రారంభం కావడంతో ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు పార్ట్‌– 2 పాఠ్యపుస్తకాల పంపిణీకి విద్యాశాఖ శ్రీకారం చుట్టింది. ఇప్పటికే జిల్లా కేంద్రంలోని ప్రధాన గోదాం నుంచి మండల వనరుల కేంద్రాలకు(ఎంఆర్‌సీ కార్యాలయాలు) పుస్తకాల రవాణా ప్రారంభమైంది. మరో రెండు రోజులపాటు పంపిణీ ప్రక్రియ నిరంతరంగా కొనసాగుతుందని అధికారులు వెల్లడించారు. అక్కడి నుంచి నేరుగా ఆయా పాఠశాలలకు చేరవేసి విద్యార్థులకు అందజేసేలా చర్యలు ముమ్మరం చేశారు.

రెండో విడతలో 95,320 పుస్తకాలు

జిల్లావ్యాప్తంగా 1,042 ప్రభుత్వ పాఠశాలల్లో 49,100 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. వీరికి 2026– 27 విద్యా సంవత్సరం ప్రారంభంలో నే మొదటి విడత పాఠ్య పుస్తకాలను విద్యాశాఖ పంపిణీ చేసింది. ద్వితీయార్ధానికి సంబంధించి ప్రస్తు తం 95,320 పార్ట్‌– 2 పాఠ్య పుస్తకాలను కేటాయించింది. తెలుగు, ఇంగ్లిష్‌ మీడియాల్లో ద్విభాషా విధానంలో ముద్రించిన ఈ పుస్తకాలను వేగంగా బడులకు చేరవేస్తున్నారు. వీటితో పాటు అకాడమి క్‌ క్యాలెండర్లను కూడా పంపిణీ చేస్తున్నారు.

సకాలంలో అందేలా చర్యలు

సాధారణంగా ఎస్‌ఏ– 1 పరీక్షల సమయానికే ఈ పుస్తకాలు అందాల్సి ఉన్నప్పటికీ కాస్త ఆలస్యంగా జిల్లాకు చేరుకున్నాయి. విద్యా బోధనలకు ఎలాంటి అడ్డంకి కలగకుండా దసరా సెలవులు ముగిసిన వెంటనే పాఠశాలలకు సరఫరా చేస్తున్నారు. రానున్న రోజుల్లో ఎంఆర్‌సీల నుంచి క్షేత్రస్థాయిలో అన్ని ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలకు పుస్తకాలు చేరనున్నాయి. దీంతో ఉపాధ్యాయులు వెంటనే విద్యార్థులకు వీటిని పంపిణీ చేసి తదుపరి సిలబస్‌ బోధనకు సిద్ధం చేయాలని విద్యాశాఖ అధికారులు ఆదేశించారు.

రెండు రోజుల్లో పంపిణీ పూర్తి

ఇప్పటికే సగం పాఠశాలలకు పార్ట్‌– 2 పాఠ్య పుస్తకాలు చేరాయి. కొన్ని మండలాల్లో ఎంఆర్‌సీల నుంచి ఉపాధ్యాయులు తమ బడులకు తీసుకెళ్లారు. జిల్లా కేంద్రం నుంచి పుస్తకాల పంపిణీ రెండు రోజుల్లోగా పూర్తి చేస్తాం. ప్రతి విద్యార్థికి పుస్తకాలు అందేలా ఉపాధ్యాయులు చర్యలు తీసుకోవాలి. – ఆర్‌.ప్రకాశ్‌, పుస్తకాల డిపో మేనేజర్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement