విద్యుత్‌ కోతలతో రైతులకు అవస్థలు | - | Sakshi
Sakshi News home page

విద్యుత్‌ కోతలతో రైతులకు అవస్థలు

Oct 17 2026 6:36 AM | Updated on Oct 17 2026 6:36 AM

ఆసిఫాబాద్‌అర్బన్‌: రాష్ట్ర వ్యాప్తంగా విద్యుత్‌ కోతలతో రైతులు, ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆసిఫాబాద్‌ ఎమ్మెల్యే కోవ లక్ష్మి విమర్శించారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని క్యాంప్‌ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మా ట్లాడారు. రైతులకు పంట చేతికందే సమయంలో విద్యుత్‌ సరఫరాలో అంతరాయంతో మోటార్లు కా లిపోతున్నాయని, ట్రాన్స్‌ఫార్మర్‌లు పేలుతున్నాయ ని, రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణకు కీలకమైన సంగరేణి సంస్థను నిర్వీర్యం చేసి ప్రైవేటీకరణ దిశగా తీసుకెళ్లే ప్రయత్నాలు సరికాదని మండిపడ్డారు. విద్యుత్‌ కో తలతో ప్రభుత్వ వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందు కు అధికారులను బాధ్యులు చేయడం సరికాదని, సీఎం పూర్తి బాధ్యత వహించాలని డిమాండ్‌ చేశా రు. సమావేశంలో మున్సిపల్‌ చైర్మన్‌ మెంగ్రె ఆకాశ్‌, కౌన్సిలర్‌లు చిలువేరు వెంకన్న, నాగుబాయి, దూ డల లక్ష్మి, బీఆర్‌ఎస్‌ నాయకులు మర్సుకోల సరస్వ తి, రవీందర్‌, సాయిశ్రావణ్‌, వినోద్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement