మాదకద్రవ్యాల వినియోగంతో జీవితాలు నాశనం | - | Sakshi
Sakshi News home page

మాదకద్రవ్యాల వినియోగంతో జీవితాలు నాశనం

Oct 13 2026 12:05 AM | Updated on Oct 13 2026 12:05 AM

● ఎస్పీ నితిక పంత్‌

కెరమెరి: మాదకద్రవ్యాల వినియోగంతో జీవితాలు నాశనమవుతాయని ఎస్పీ నితిక పంత్‌ అన్నారు. జైనూర్‌ మండల కేంద్రంలోని జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో సోమవారం పోలీసుల ఆధ్వర్యంలో వాలీబాల్‌ క్రీడాపోటీలను ప్రారంభించారు. ఎస్పీ మాట్లాడుతూ యువత చెడు వ్యసనాలు, మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలన్నారు. గంజాయి సాగు, క్రయవిక్రయాలు, వినియోగం నేరమని స్పష్టం చేశారు. యువకులు క్రీడలపై మక్కువ పెంచుకోవాలని సూచించారు. అనంతరం పోలీసులతో కలిసి గ్రామంలో ర్యాలీ నిర్వహించారు. అలాగే విజేతలకు నగదు పురస్కారం, క్రీడాకారులకు టీషర్లు అందించారు. కార్యక్రమంలో డీఎస్పీ అశోక్‌, జైనూర్‌, వాంకిడి సీఐలు రమేశ్‌, వేణుగోపాల్‌, ఎస్సైలు రవి, రాజు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement