అప్రమత్తతే రక్ష! | - | Sakshi
Sakshi News home page

అప్రమత్తతే రక్ష!

Aug 21 2025 6:46 AM | Updated on Aug 21 2025 6:46 AM

అప్రమత్తతే రక్ష!

అప్రమత్తతే రక్ష!

బ్యాంకు, పోలీసు, ఇతర అధికారులెవ్వరూ ఫోన్‌లో వివరాలు సేకరించరని గుర్తుంచుకోవాలి. ఎట్టి పరిస్థితిలోనూ వ్యక్తిగత వివరాలు ఇవ్వొద్దు.

కస్టమ్స్‌, ఏసీబీ, ఈడీ, సీబీఐ, పోలీసులు.. ఇలా ఏ దర్యాప్తు సంస్థ ఫోన్‌లో లేదా వీడియో ద్వారా విచారణ చేపట్ట దు. ఇలాంటి వ్యక్తుల పేరుతో ఫోన్‌ కాల్‌ వచ్చిందంటే అనుమానించాల్సిందే. గుర్తు తెలియని నంబర్ల నుంచి కాల్స్‌ వస్తే స్పందించవద్దు. విసిగిస్తే నంబర్లను బ్లాక్‌ చేయడం ఉత్తమం.

న్యూడ్‌ వీడియోకాల్స్‌కు భయపడాల్సిన అవసరం లేదు. వేధింపులకు గురిచేస్తే కుంగిపోవద్దు. పోలీస్‌స్టేషన్‌లో సమాచా రం అందించి ఫిర్యాదు చేయాలి. నగదు పోతే పోలీస్‌స్టేషన్‌ లేదా బ్యాంకులో ఫి ర్యాదు చేస్తే ఆ నగదు ఇతర ఖాతాలకు బదిలీ కాకుండా నిలిపి వేసే అవకాశం ఉంటుంది. వేగంగా ఫిర్యాదు చేస్తే నగ దు రికవరీకి అవకాశాలు పెరుగుతాయి.

పెరుగుతున్న సైబర్‌ మోసాలు అప్పులపాలవుతున్న యువకులు గ్రామాల్లో అవగాహన కల్పిస్తున్న పోలీసుశాఖ తక్షణమే ఫిర్యాదు చేయాలని సూచన

చింతలమానెపల్లి(సిర్పూర్‌): రోజురోజుకూ అభివృద్ధి చెందుతున్న సాంకేతిక పరిజ్ఞానాన్ని సైబర్‌ నేరగాళ్లు వినియోగించుకుంటున్నారు. కొత్తపోకడలు అనుసరిస్తూ మోసాలకు పాల్పడుతున్నారు. జిల్లావ్యాప్తంగా బాధితుల సంఖ్య పెరుగుతుండటంతో పోలీస్‌స్టేషన్లకు ఫిర్యాదులు పెరిగాయి. బాధితులకు న్యాయం చేయడంతోపాటు మోసాల బారిన పడకుండా పోలీసుశాఖ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. జిల్లాలో 2024లో 401 సైబర్‌ క్రైం ఫిర్యాదులు రాగా వీటిలో 31 ఘటనలపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు. 2025లో ఇప్పటివరకు 195 ఫిర్యాదులు రాగా 15 ఘటనలపై ఎఫ్‌ఐఆర్‌ నమోదైనట్లు సైబర్‌ క్రైం పోలీసులు వెల్లడించారు.

పలు రకాలుగా మోసం

‘బ్యాంకుల్లో నగదు తమకు తెలియకుండానే మా యమవుతుంది... బ్యాంకు అధికారులమని చెప్పి ఫోన్‌పే ద్వారా నగదు తీసుకున్నారు.. ఖాతాల్లోని నగదు వినియోగించుకోలేక పోతున్నాం..’ అంటూ ఇటీవల తరచూ పోలీస్‌స్టేషన్లకు, బ్యాంకులకు ఫిర్యాదులు వస్తున్నాయి. జిల్లావ్యాప్తంగా ఆన్‌లైన్‌లో ఆటలు ఆడి నగదు కోల్పోతున్న వారి సంఖ్య కూడా వందల సంఖ్యలో ఉంటోంది. చిన్నారులు సైతం లక్షలాది రూపాయలను ఆన్‌లైన్‌లో కోల్పోతున్నారు. ఆన్‌లైన్‌ బెట్టింగ్‌, గేమ్స్‌, షాపింగ్‌ ద్వారా సైబర్‌ నేరాలు జరుగుతున్నాయి. ఇటీవల కస్టమ్స్‌ అధికారులమని, నగ్న వీడియో కాల్స్‌తో బెదిరింపులు సైతం కేసులు నమోదవుతున్నాయి. సోషల్‌ మీ డియాను నేరగాళ్లు మోసాలకు అనువుగా మార్చుకుంటున్నారు. అమాయకులను బుట్టలో వేసుకోవడానికి ఈ సమాచార వేదికల ద్వారా నెట్‌వర్క్‌ పెంచుకుంటున్నారు. నిమిషాల్లో రూ.లక్షల ఆదాయం, కార్లు, విలువైన బహుమతుల పేర్లతో ఆకర్షణీయమైన ప్రకటనలు ఇస్తూ మోసం చేస్తున్నారు. రకరకాల కరెన్సీల పేరుతో పెట్టుబడి పెట్టించి రెట్టింపు లాభాలు ఆశ చూపి బుట్టలో వేస్తున్నారు. వాట్సాప్‌ గ్రూపులు, సోషల్‌ మీడియాలో గుర్తు తెలియని లింక్‌లు తెరిచినా వ్యక్తిగత సమాచారం, ఇతర వివరాలను తస్కరణకు గురయ్యే అవకాశం ఉంది.

చింతలమానెపల్లి మండలంలోని ఓ గ్రామానికి చెందిన యువకుడు వివాదాలకు దూరంగా ఉంటాడు. అందరితో కలివిడిగా ఉండే అతను లక్షల రూపాయలు అప్పుల పాలయ్యాడు. ఇల్లు, భూములు అమ్ముకుని చెల్లించినా పూర్తిస్థాయిలో తీరలేదు. సాధారణ జీవితం గడిపే అతడు ఎలా అప్పుల పాలయ్యాడనేది గ్రామంలో చర్చనీయంగా మారింది. ఆన్‌లైన్‌ గేమ్స్‌ ఆడి డబ్బులు పోగొట్టుకున్నట్లు తెలిసింది.

రకరకాలుగా బెదిరింపులు..

రాత్రి సమయంలో గుర్తు తెలియని నంబర్‌ నుంచి వీడియో కాల్‌ వస్తుంది. ఎవరో అనుకుని కాల్‌ లిఫ్ట్‌ చేస్తే.. అవతలి వైపు ఒక నగ్నంగా ఉన్న వ్యక్తి.. ఫోన్‌లో స్క్రీన్‌ రికార్డింగ్‌ చేసుకుని ఆపై బెదిరింపులకు పాల్పడతారు. భయపడినా, అమాయకంగా కనిపించినా బెదిరింపులకు దిగుతారు. అందిన కాడికి డబ్బులు వసూలు చేసేందుకు ఎంతకై నా తెగిస్తారు. అలాగే కొరియర్‌ పంపించి, అందులో వివాదాస్పద వస్తువులు ఉన్నాయని పోలీసు అధికారుల పేరుతో బెదిరింపులకు పాల్పడతారు. బ్యాంకు అధికారులమని చెప్పి వ్యక్తిగత వివరాలతోపాటు పాస్‌బుక్‌, ఆధార్‌, ఓటీపీ ఇతర వివరాలను సేకరిస్తున్నారు. ఇలా ఖాతాల్లోని సొమ్ము మాయం చేస్తున్నారు. సమయంలో అప్రమత్తంగా ఉంటే సమస్య నుంచి బయటపడొచ్చని అధికారులు సూచనలు చేస్తున్నారు.

బెజ్జూర్‌ మండలంలోని సలుగుపల్లికి చెందిన ఆత్రం సాయి ఆన్‌లైన్‌లో రూ.28వేలు మోసపోయినట్లుగా ఫిర్యాదు పోలీసులకు చేశాడు. హర్షసాయి అనే యూట్యూబర్‌ పేరుతో హర్యానాలోని మేవాట్‌ ప్రాంతానికి చెందిన తౌఫిక్‌ మోసాలకు పాల్పడుతున్నట్లుగా సైబర్‌ క్రైం పోలీసులు గుర్తించారు. అనుచరులతో కలిసి నకిలీ నంబర్లు, వాట్సాప్‌ ద్వారా ప్రలోభాలు గురిచేసి ఫోన్‌పే ద్వారా డబ్బులు వసూలు చేస్తున్నట్లు గుర్తించారు. విచారణ చేపట్టిన పోలీసులు నిందితుడిని అరెస్టు చేశారు.

‘జన్నారం’ ఘటనతో అలర్ట్‌

మంచిర్యాల జిల్లా జన్నారంలో సిమ్‌కార్డుల ద్వారా సైబర్‌ మోసాలకు పాల్పడుతున్న నెట్‌వర్క్‌ పోలీసులు చేధించారు. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన వ్యక్తులతోపాటు స్థానికులను అదుపులోకి తీసుకున్నారు. మారుమూల ప్రాంతాలను సైబర్‌ నేరగాళ్లు అడ్డాలుగా మార్చుకుంటుండటంతో జిల్లా పోలీసు అల ర్ట్‌ అయ్యారు. సైబర్‌ క్రైం నియంత్రణలో భాగంగా అన్ని పోలీస్‌స్టేషన్ల పరిధిలో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. కళాజాత బృందాలు, స్వచ్ఛంద సంస్థల ఆధ్వర్యంలో సాంస్కృతిక కార్యక్రమాలు చేపడుతున్నారు. ఎస్పీ కాంతిలాల్‌, ఏఎస్పీ, డీఎస్పీ స్థాయి అధికారులు సైతం వేదికలపై డిజిటల్‌ మోసాల గురించి ప్రస్తావిస్తున్నా రు. యువత అవగాహన పెంచుకుని తల్లి దండ్రులకు వివరించాలని సూచిస్తున్నారు. స్టేషన్లలో సీఐ, ఎస్సై, సిబ్బందితో టీంను ఏర్పాటు చేసి కేసులను విచారిస్తున్నారు. సైబర్‌ క్రైం కేసుల్లో ఆర్థిక, ఆర్థికేతర ఘటనలుగా వేర్వేరుగా విభజించి ఫిర్యాదులు స్వీకరిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement