
3న జాతీయ లోక్‌అదాలత్
ఆసిఫాబాద్: జిల్లా కేంద్రంలోని కోర్టు ఆవరణలో సెప్టెంబర్ 13న జాతీయ లోక్ అదాలత్ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు జిల్లా ప్రధాన న్యాయమూర్తి, జిల్లా లీగల్ సెల్ అథారిటీ చైర్మన్ ఎంవీ రమేశ్ తెలిపారు. జిల్లా కేంద్రంలోని కోర్టులో గురువారం సీనియర్ సివిల్ జడ్జి యువరాజ, జూనియర్ సివిల్ జడ్జి ఉల్లం అజయ్, జ్యుడిషియల్ మేజిస్ట్రేట్ ఆఫ్ సెకండ్ క్లాస్ అమృత్‌పౌల్ కౌర్, ఏఎస్పీ చిత్తరంజన్‌తో కలిసి సమావేశం నిర్వహించారు. జిల్లా ప్రధాన న్యాయమూర్తి మాట్లాడుతూ లోక్‌అదాలత్‌లో రాజీ మార్గం ద్వారా కేసులు పరి ష్కరించుకోవాలని సూచించారు. పోలీస్ స్టేషన్ల పరిధిలో రాజీ చేయడానికి అనుకూలంగా ఉన్న కక్షిదారులకు అవగాహన కల్పించాలని ఆదేశించారు. కాగజ్‌నగర్ డీఎస్పీ రామానుజం, సీఐలు, ఎస్సైలు, కోర్టు విధులు నిర్వహించే కానిస్టేబుళ్లు పాల్గొన్నారు.