
క్షీణిస్తున్న ‘పాల్వాయి’ ఆరోగ్యం
కాగజ్‌నగర్‌టౌన్: ఎమ్మెల్యే పాల్వయి హరీశ్‌బాబు చేపట్టిన నిరవధిక నిరాహార దీక్ష గురువారం నాలుగో రోజుకు చేరింది. రాత్రి ప్రభు త్వ ఆస్పత్రి వైద్యుడు శ్రీధర్‌బాబు వైద్య పరీక్షలు నిర్వహించారు. రక్త పరీక్షలు నిర్వహించి షుగర్ లెవల్స్ తగ్గుతున్నాయని తెలిపారు. దీక్ష ఇలాగే కొనసాగితే ఎమ్మెల్యే ఆరోగ్యం దెబ్బతింటుందని పేర్కొన్నారు. కాగా, రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని వ్యతిరేకిస్తూ బీజేపీ నాయకులు శుక్రవారం కాగజ్‌నగర్ పట్టణ బంద్‌కు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా పట్టణ అధ్యక్షుడు శివకుమార్ మాట్లాడుతూ ఎమ్మెల్యే తీవ్ర అస్వస్థతకు గురైతే జరిగే పరిణామాలకు కాంగ్రెస్ ప్రభుత్వం బాధ్యత వహించాలని హెచ్చరించా రు. సమావేశంలో ఈర్ల విశ్వేశ్వర్‌రావు, శ్రీని వాస్, మోతీరాం తదితరులు పాల్గొన్నారు.
ఎమ్మెల్సీ అంజిరెడ్డి మద్దతు
సత్యాగ్రహ దీక్ష చేపట్టిన ఎమ్మెల్యే పాల్వాయి హరీశ్‌బాబుకు బీజేపీ పట్టభద్రుల ఎమ్మెల్సీ అంజిరెడ్డి మద్దతు పలికారు. కాగజ్‌నగర్ మండలంలోని బెంగాళీలు, విశ్వబ్రహ్మణ సంఘం, రిటైర్డ్ ఉద్యోగుల సంఘం నాయకులు మద్దతు తెలిపారు. కార్యక్రమంలో బీజేపీ మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు వెంకటేశ్వర్‌గౌడ్, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ఎమ్మాజీ, నాయకులు ముకేశ్‌గౌడ్, తిరుపతి, ఆంజనేయులు, గోవర్ధన్, సంతోష్, శ్రీనివాస్ తదితరులు ఉన్నారు.