
‘పింఛన్లు పెంచకుంటే ఊరుకోం’
కౌటాల(సిర్పూర్): హామీ మేరకు కాంగ్రెస్ ప్ర భుత్వం పింఛన్లు పెంచకుంటే ఊరుకోమని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ హెచ్చరించారు. కౌటాలలో గురువారం ఏర్పాటు చేసిన మహాగర్జన స న్నాహక సదస్సులో మాట్లాడారు. దివ్యాంగులకు రూ.6వేలు, వృద్ధులు, వితంతువులకు రూ.4 వేలు ఇస్తామని అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌ను ప్రతిపక్ష పార్టీలు ఎందుకు ప్రశ్నించడం లేదన్నారు. సెప్టెంబర్ మొదటి వారంలోగా పెన్షన్లు పెంచకుంటే హైదరాబాద్‌లో ధర్నా చేస్తామని హెచ్చరించారు. ఎమ్మార్పీఎ స్ మండల అధ్యక్షుడు ఇగురపు విఠల్, నాయకులు పిట్టల సత్యనారాయణ, థామస్, అని ల్, రాజేశ్, హీరమన్, శంకర్ పాల్గొన్నారు.