
మద్యం పాలసీ వచ్చేసింది..
ఆసిఫాబాద్: తెలంగాణ ప్రభుత్వం కొత్త మద్యం పాలసీని ప్రకటించింది. ప్రస్తుత పాలసీ ఈ ఏడాది నవంబర్ 30తో ముగియనుండగా, పెద్ద ఎత్తున ఆదాయం సమకూరేలా 2025– 27 నూతన ఎకై ్సజ్ పాలసీ ఖరారు చేసింది. రెండేళ్లపాటు ఈ విధానం అమల్లో ఉండనుంది. తిరిగి చెల్లించని దరఖాస్తు రుసుం గతంలో రూ.2 లక్షలు ఉండగా, తాజాగా రూ.3 లక్షలకు పెంచింది. అయితే టెండర్ షెడ్యూల్‌ను మాత్రం ప్రకటించలేదు. సెప్టెంబర్ మొదటి వారంలో దరఖాస్తుల స్వీకరించే అవకాశాలు ఉన్నా యి. రెండేళ్లపాటు దుకాణాల నిర్వహణకు ఒకరు ఎన్నైనా దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తుల స్వీకరణ తేదీలను త్వరలో ప్రకటించనున్నారు.
జిల్లాలో 32 మద్యం దుకాణాలు
డిసెంబర్ నుంచి కొత్త ఎకై ్సజ్ పాలసీ అమల్లోకి రానుంది. రెండేళ్ల క్రితం నిర్వహించిన టెండర్లలో జిల్లాలోని 32 మద్యం దుకాణాలకు 1,020 దరఖాస్తులు వచ్చాయి. ప్రభుత్వానికి రూ.20.40 కోట్ల ఆదాయం సమకూరింది. గతంలో మాదిరిగానే జిల్లాలోని 15 మండలాల్లో 32 మద్యం దుకాణాలు ఏర్పాటు చేయనున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ, గౌడ కులస్తులకు రిజర్వేషన్ ప్రాతిపదికన షాపులు కేటాయించనుంది. గౌడ కులస్తులకు 2, ఎస్సీ 4, ఎస్టీలకు 6 దుకాణాలు కేటాయించగా, జనరల్ కేటగిరీలో మరో 20 దుకాణాలకు లక్కీ డ్రా పద్ధతిన టెండర్లు నిర్వహించనున్నారు. ఒక్కో దరఖాస్తుకు రుసుం రూ.3 లక్షలు చెల్లించాల్సి ఉంటుంది. రిజర్వ్‌డ్ ప్రాంతాల్లో దరఖాస్తు చేసుకునే వారు ఆధార్ కార్డు, పాన్ కార్డుతోపాటు కుల ధ్రువీకరణ పత్రం సమర్పించాలి. జనరల్ కేటగిరీ అయితే ఆధార్, పాన్ కార్డు, మూడు పాస్‌ఫొటోలు జత చేయాలి. ఈ విషయమై జిల్లా ఎకై ్సజ్ అధికారి జ్యోతికిరణ్‌ను సంప్రదించగా.. జిల్లాలో పాత విధానం మాదిరిగానే మద్యం దుకాణాలకు టెండర్లు నిర్వహించనున్నట్లు తెలిపారు. దరఖాస్తుల స్వీకరణ తేదీ ఇంకా ఖరారు కాలేదని పేర్కొన్నారు.