
గంజాయి సాగు చేస్తే రాయితీలు రద్దు
ఆసిఫాబాద్: గంజాయి సాగు చేస్తే రైతులకు ప్రభుత్వం అందించే రాయితీలు రద్దు చేస్తామని కలెక్టర్ వెంకటేశ్ దోత్రే అన్నారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్‌లో గురువారం మాదకద్రవ్యాల నివారణపై ‘నషా ముక్త్ భారత్ అభియాన్’పై సమీక్ష నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ మారుమూల గ్రామాలు, గుట్టలు, అటవీ ప్రాంతాల్లో గంజాయి సాగు చేస్తున్నారని, అధికారులు భూయజమానులపై చ ర్యలు తీసుకోవాలని ఆదేశించారు. విద్యాసంస్థలకు 200 మీటర్ల దూరం వరకు ఎలాంటి పాన్‌టేలాలు ఉండొద్దని అన్నారు. జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో మాదకద్రవ్యాలకు బానిసైన వారికి చికిత్స కేంద్రం ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు.
పండుగలు ప్రశాంతంగా జరుపుకోవాలి
జిల్లాలో పండగలు ప్రశాంతంగా జరుపుకోవాలని కలెక్టర్ వెంకటేశ్‌దోత్రే అన్నారు. వినాయక చవితి, మిలాద్ ఉన్‌నబీ ఉత్సవాల నేపథ్యంలో గురువారం కలెక్టరేట్‌లో ఉత్సవాల నిర్వాహకులు, మసీదు కమిటీ ప్రతినిధులతో శాంతికమిటీ సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ గణేశ్ మంట పాల పారిశుద్ధ్య పనులు చేపట్టాలని, ట్రాఫిక్ సమ స్య తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఆయా సమావేశాల్లో ఎస్పీ కాంతిలాల్ పాటిల్, సబ్ కలెక్టర్ శ్రద్ధా శుక్లా, ఏఎస్పీ చిత్తరంజన్, ఆర్డీవో లోకేశ్వర్‌రావు, జిల్లా ఎకై ్సజ్ అధికారి జ్యోతికిరణ్, జిల్లా సంక్షేమ అధికారి భాస్కర్, జిల్లా గిరిజన సంక్షేమ అధికారి రమాదేవి, డీటీవో రాంచంందర్, ఎస్సీ సంక్షేమ అధికారి సజీవన్, డీఎస్పీ రామానుజం, ట్రాన్స్‌కో ఎస్‌ఈ శేషారావు, డీపీవో భిక్షపతి, శాంతి కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.