
అట్టహాసంగా జిల్లాస్థాయి ఎంపిక పోటీలు
ఆసిఫాబాద్‌రూరల్: జిల్లా కేంద్రంలోని గిరిజన ఆదర్శ క్రీడాపాఠశాలలో శుక్రవారం జిల్లా స్థాయి అథ్లెటిక్స్ ఎంపిక పోటీలు అట్టహాసంగా నిర్వహించారు. అథ్లెటిక్స్ అసోసియేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శి లక్ష్మణ్ మాట్లాడుతూ జిల్లాస్థాయి అథ్లెటిక్స్ ఎంపిక పోటీలకు 150 మంది క్రీడాకారులు హాజరయ్యారని తెలిపారు. ఉత్తమ ప్రతిభ చూపిన 30 మందిని రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక చేశామన్నారు. ఈ నెల 30, 31 తేదీల్లో మహబూబ్‌గనగర్‌లో జరిగే రాష్ట్రస్థాయిలో పోటీల్లో వీరు పాల్గొంటారని పేర్కొన్నారు. కార్యక్రమంలో అథ్లెటిక్స్ కోచ్‌లు విద్యాసాగర్, అరవింద్, పీఈటీలు యాదగిరి, లక్ష్మి, సరోజ, శ్రీనివాస్, ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.