
అందుబాటులో ఉండి వైద్యం అందించాలి
తిర్యాణి(ఆసిఫాబాద్): ఏజెన్సీ ప్రాంతాల్లోని ప్రభుత్వ ఆస్పత్రుల్లో వైద్యులు నిత్యం అందుబాటులో ఉంటూ గిరిజనులు మెరుగైన వైద్యం అందించాలని రాష్ట్ర గిరిజన కార్పొరేషన్ చైర్మన్ కోట్నాక తిరుపతి అన్నారు. తిర్యాణి మండలం గిన్నెధరిలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని శుక్రవారం తనిఖీ చేశారు. ఆస్పత్రిలో పర్మినెంట్ 108 అంబులెన్స్ అందుబాటులో లేదని, సిబ్బందికి సరిపడా భవనాలు లేవని, తదితర సమస్యలను చైర్మన్ దృష్టికి తీసుకెళ్లారు. వెంటనే ఆయన ఐటీడీఏ పీవోతో ఫోన్‌లో మాట్లాడి సమస్యలు పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. ఇన్‌చార్జి మంత్రితో మాట్లాడి సిబ్బందికి నూతన భవనాలు నిర్మించేందుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో రాయిసెంటర్ జిల్లా సార్మెడి కుర్సెంగ మోతీరాం, గిన్నెధరి సార్మెడి అడ తాను, ఆదివాసీ మహిళా సంఘం జిల్లా అధ్యక్షురాలు మర్సుకోల కమల తదితరులు పాల్గొన్నారు.