
సరుకులు సైతం అందించాలి
ప్రభుత్వం నూతన రేషన్ కార్డులు మంజూరు చేయడం సంతోషంగా ఉంది. గతంలో మాదిరి రేషన్ దుకాణాల ద్వారా బియ్యంతోపాటు పప్పు, నూనె, చక్కెర, ఉప్పు, కారం వంటి నిత్యావసర సరుకులు అందించాలి. ప్రస్తుతం మార్కెట్‌లో ధరలు పెరగడంతో కొనలేని పరిస్థితి ఉంది.
– వొజ్జల శిరీష్‌శర్మ, ఆసిఫాబాద్
ఐదేళ్లుగా ఎదురుచూశాం
ఐదేళ్ల క్రితం నాకు వివాహం జరిగింది. అప్పటి నుంచి రేషన్‌కార్డు లేక చాలా ఇబ్బందులు పడ్డాం. రేషన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకున్న తర్వాత అధికారులు సర్వే నిర్వహించి మంజూరు చేశారు. కొన్నేళ్లపాటు ప్రభుత్వ పథకాలకు దూరమయ్యాం. ప్రస్తుతం ఆ సమస్య తీరింది.
– గుర్నులె జ్యోత్స్న, వాంకిడి

సరుకులు సైతం అందించాలి