
కార్యాలయాల్లో స్వాతంత్య్ర వేడుకలు
ఆసిఫాబాద్/ఆసిఫాబాద్‌రూరల్: జిల్లా కేంద్రంలోని పలు ప్రభుత్వ కార్యాలయాల్లో శుక్రవారం స్వాతంత్య్ర వేడుకలు ఘనంగా నిర్వహించారు. జెడ్పీ కా ర్యాలయంలో కలెక్టర్ వెంకటేశ్ దోత్రే, జిల్లా గ్రంథా లయంలో అదనపు కలెక్టర్ దీపక్ తివారి, జిల్లా న్యాయస్థానంలో జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎంవీ రమేశ్, సీనియర్ సివిల్ జడ్జి యువరాజ జాతీయ జెండా ఆవిష్కరించారు. ఆర్డీవో కార్యాలయంలో ఆర్డీవో లోకేశ్వర్‌రావు, అటవీశాఖ కార్యాలయంలో డీఎఫ్‌వో నీరజ్‌కుమార్, తహసీల్దార్ కార్యాలయంలో తహసీల్దార్ రియాజ్ అహ్మద్, ఎమ్మెల్యే క్యాంపు, బీఆర్‌ఎస్ కార్యాలయాల్లో ఎమ్మెల్యే కోవ లక్ష్మి, చైతన్య కళాశాలలో నాగేశ్వర్‌రావు, ఏఎంసీ కార్యాలయంలో కార్యదర్శి అశ్వక్ అహ్మద్, వివేకానందచౌక్‌లో దివ్యాంగుడు వెంకటేశ్వర్లు, పొట్టి శ్రీరాములు చౌక్‌లో వాసవీక్లబ్ అధ్యక్షుడు శ్రీనివాస్, మున్సి పల్ కార్యాలయం, గాంధీ చౌక్‌లో మున్సిపల్ కమి షనర్ గజానంద్, శిశుమందిర్‌లో మాజీ ఏఎంసీ చైర్మన్ వెంకన్న, ఆర్‌ఎంపీ వైద్యుల సంఘం, బీసీ సంఘం కార్యాలయాల్లో ఆ సంఘం జిల్లా అధ్యక్షుడు రూప్‌నర్ రమేశ్ జెండా ఎగురవేశారు.

కార్యాలయాల్లో స్వాతంత్య్ర వేడుకలు

కార్యాలయాల్లో స్వాతంత్య్ర వేడుకలు