
వేతనాలు చెల్లించడం లేదని ధర్నా
కాగజ్‌నగర్‌టౌన్: జిల్లాలోని ప్రభుత్వ ఆస్పత్రుల్లో విధులు నిర్వర్తిస్తున్న శానిటేషన్, పేషెంట్ కేర్, సె క్యూరిటీ సిబ్బందికి నాలుగు నెలలుగా కాంట్రాక్టర్ వేతనాలు చెల్లించడం లేదని ఏఐటీయూసీ జిల్లా ప్ర ధాన కార్యదర్శి బోగే ఉపేందర్ అన్నారు. పట్టణంలోని ప్రభుత్వ సామాజిక ఆస్పత్రి ఎదుట సిబ్బంది విధులు బహిష్కరించి ధర్నా నిర్వహించారు. ఉపేందర్ మాట్లాడుతూ సిబ్బందికి నాలుగు నెలలుగా వేతనాలు ఇవ్వడం లేదన్నారు. ఔట్‌సోర్సింగ్, కాంట్రాక్టు కార్మికులకు ఈఎస్‌ఐ, పీఎఫ్ చెల్లించడం లేదని, అధికారులకు ఫిర్యాదు చేసినా కాంట్రాక్టర్‌పై ఎందుకు చర్యలు తీసుకోవడం ప్రశ్నించారు. ప్రభుత్వం కాంట్రాక్టు విధానాన్ని రద్దు చేసి కార్పొరేషన్ ద్వారా ప్రతీ నెల 5లోగా వేతనాలను చెల్లించాలని డిమాండ్ చేశారు. ఇప్పటికై నా అధికారులు స్పందించి సమస్యలు పరిష్కరించాలని కోరారు. లేనిపక్షంలో ఏఐటీయూసీ ఆధ్వర్యంలో ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. కార్యక్రమంలో ఆస్పత్రి సి బ్బంది రాము, ఇమ్రాన్, సాయి, తిరుమల, పుష్ప, మీనాక్షి, రాజేశ్, నరేశ్, భాగ్య, శారద, నిర్మల, మునేశ్వరి తదితరులు పాల్గొన్నారు.