
కేజీబీవీని సందర్శించిన ఏడీ
కెరమెరి(ఆసిఫాబాద్): మండలంలోని మోడి కస్తూరిబా గాంధీ విద్యాలయాన్ని బుధవారం మోడల్ స్కూల్స్ అడిషనల్ డైరెక్టర్(ఏడీ) శ్రీనివాసచారి సందర్శించారు. విద్యార్థినులు, ఉపాధ్యాయుల హాజరు, టీచర్ల వార్షిక యూని ట్ ప్లాన్స్, టీచింగ్ డైరీలతోపాటు తరగతిలో బోధన పద్ధతులను పరిశీలించారు. బేస్‌లైన్, ఫార్మాటివ్ అసెస్మెంట్ పరీక్ష పత్రాలను పరిశీ లించి, విద్యార్థులకు కనీస అభ్యసన సామర్థ్యాలు ఎలా సాధించాలో తెలియజేశారు. పాఠ్య ప్రణాళిక ప్రకారం కనీస అభ్యసన సామర్థ్యాలు సాధించేలా బోధించాలని ఉపాధ్యాయులకు సూచించారు. జిల్లా ఏఎంవో ఉప్పులేటి శ్రీనివాస్, ఎస్‌వో ప్రవీణ పాల్గొన్నారు.