రైతు, కూలీలకు వ్యతిరేకంగా పాలన | - | Sakshi
Sakshi News home page

రైతు, కూలీలకు వ్యతిరేకంగా పాలన

Sep 22 2026 12:24 AM | Updated on Sep 22 2026 12:24 AM

ఖమ్మంమయూరిసెంటర్‌: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతు కూలీల సంక్షేమానికి వ్యతిరేకంగా పాలన సాగిస్తున్నాయని అఖిల భారత రైతు కూలీ సంఘం(ఏఐకేఎంఎస్‌) జాతీయ నాయకుడు జే.వీ.చలపతిరావు విమర్శించారు. దేశవ్యాప్తంగా ఎల్‌నినో ప్రభావంతో కరువు పరిస్థితులు నెలకొన్నందున తక్షణమే కరువు సహాయ చర్యలు చేపట్టాలని డిమాండ్‌ చేశారు. ఈనెల 28నుంచి ఖమ్మంలో జరగనున్న ఏఐకేఎంఎస్‌ జాతీయ మహాసభలను జయప్రదం చేయాలని కోరుతూ సోమవారం రెడ్‌ షర్ట్‌ వలంటీర్లు, డప్పు దళాలతో ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా చలపతిరావు మాట్లాడుతూ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పేరు మార్చి, రాష్ట్రాల వాటాను పెంచడం ద్వారా పథకాన్ని బలహీనపరుస్తున్నారని ఆరోపించారు. సమైక్య పోరాటాల ద్వారా పథకాన్ని కాపాడుకోవాలని పిలుపునిచ్చారు. అలాగే, పాలకుల ప్రజా, కార్మిక, రైతు వ్యతిరేక విధానాలను తిప్పికొట్టేందుకు ఉద్యమాలకు సిద్ధమయ్యేలా ఏఐకేఎంఎస్‌ జాతీయ మహాసభలను జయప్రదం చేయాలని కోరారు. ఏఐకేఎంఎస్‌ తెలంగాణ రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు వి.కోటేశ్వరరావు, రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు మామిడాల బిక్షపతి, ఐలయ్య, నాయకులు మండల వెంకన్న, బండారి ఐలయ్య, నందగిరి వెంకటేశ్వర్లు, ఏనుగు చంద్రారెడ్డి, శంకర్‌, సైదులు, దేవేందర్‌ తదితరులు పాల్గొన్నారు.

ఏఐకేఎంఎస్‌ జాతీయ నాయకుడు

చలపతిరావు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement