సత్తుపల్లి: సీతారామ ఎత్తిపోతల ప్రాజెక్టులో భాగమైన సత్తుపల్లి ట్రంక్ పనుల్లో వేగం పెంచి గోదావరి జలాలను బేతుపల్లి చెరువుకు తరలించేందుకు సిద్ధం కావాలని రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదేశించారు. సత్తుపల్లి మండలం యాతాలకుంట టన్నెల్ పనులను అశ్వారావుపేట ఎమ్మెల్యే జారే ఆదినారాయణ, భద్రాద్రి కలెక్టర్ అంకిత్‌తో కలిసి సోమవారం ఆయన పరిశీలించారు. లైనింగ్ పనులపై సంతృప్తి వ్యక్తం చేసిన మంత్రి మాట్లాడారు. భూసేకరణ కోసం ఇప్పటికే రూ.45 కోట్లు మంజూరైనందున, కాల్వ పనులను వచ్చే నెల 15వ తేదీకల్లా పూర్తిచేయాలని తెలిపారు. ఎస్‌ఈ శ్రీనివాసరెడ్డి, అధికారులు పాల్గొన్నారు.
పరిశీలించిన రాష్ట్ర మంత్రి తుమ్మల


