కొణిజర్ల: రైతులు పండించిన పెసర పంటను ప్రభుత్వం మార్క్‌ఫెడ్ ద్వారా కొనుగోలు చేయాలనే డిమాండ్‌తో సీపీఐ, రైతు సంఘం ఆధ్వర్యాన ఆందోళనకు దిగారు. కొణిజర్ల మండల పరిషత్ కార్యాలయంలో సోమవారం జరిగిన ప్రజావాణిని అడ్డుకుని పోడియం వద్ద బైఠాయించారు. తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బాగం హేమంతరావు మాట్లాడుతూ ప్రభుత్వ పరంగా కొనుగోళ్లు మొదలుకాకపోవడంతో వ్యాపారులు పెసర పంటను తక్కువ ధరకు కొనుగోలు చేస్తున్నారని పేర్కొన్నారు. ఫలితంగా రైతులకు నష్టం జరుగుతోందని తెలిపారు. ఈమేరకు ఎంపీడీఓ జి.వర్ష, తహసీల్దార్ ఎన్.అరుణ విషయాన్ని జిల్లా ఉన్నతాధికారులకు వివరించగా, త్వరలోనే మార్క్‌ఫెడ్ ద్వారా పెసర కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయిస్తామని హామీ ఇవ్వగా వారు ఆందోళన విరమించారు. సీపీఐ, రైతు సంఘంతో పాటు బీఆర్‌ఎస్ నాయకులు జమ్ముల జితేందర్‌రెడ్డి, దొండపాటి రమేష్, ఎర్రా బాబు, స్వర్ణ రమేష్, తోటపల్లి సీతారాములు, తమ్మిశెట్టి వెంకటేశ్వర్లు, మణిగె కోటేశ్వరరావు, పోట్ల శ్రీను, రాంపూడి సురేష్, గోపాలరావు, నరసింహారావు, శ్రీను తదితరులు పాల్గొన్నారు.


