మొదటి అడుగే తడబాటు ! | - | Sakshi
Sakshi News home page

మొదటి అడుగే తడబాటు !

Aug 18 2026 12:51 AM | Updated on Aug 18 2026 12:51 AM

● ఎంపీడీఓ ఆఫీసుల్లో ప్రజావాణి షురూ..● అంతంత మాత్రంగానే దరఖాస్తులు మండలాల వారీగా హాజరైన అధికారులు, అందిన ఫిర్యాదులు

● ఎంపీడీఓ ఆఫీసుల్లో ప్రజావాణి షురూ..● అంతంత మాత్రంగానే దరఖాస్తులు

మండలం అధికారులు ఫిర్యాదులు

సత్తుపల్లి 20 46

తిరుమలాయపాలెం 29 26

కల్లూరు 19 26

తల్లాడ 24 25

వేంసూరు 18 17

ఖమ్మం రూరల్‌ 29 17

కూసుమంచి 19 15

మధిర 21 13

పెనుబల్లి 19 13

ముదిగొండ 20 10

కొణిజర్ల 24 09

బోనకల్‌ 25 09

కారేపల్లి 17 09

నేలకొండపల్లి 25 08

వైరా 19 08

రఘునాథపాలెం 22 07

ఎర్రుపాలెం 18 05

కామేపల్లి 17 04

చింతకాని 17 03

ఏన్కూరు 18 02

ఖమ్మం సహకారనగర్‌: ప్రజాసమస్యల పరిష్కారం కోసం ప్రతీ సోమవారం కలెక్టరేట్‌లో ప్రజావాణి నిర్వహిస్తున్నారు. ప్రజలకు దూరా భారం తగ్గించేందుకు మండల కేంద్రాల్లోని ఎంపీడీఓ కార్యాలయాల్లో కూడా నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ సోమవారం కార్యక్రమం మొదలుకాగా, చాలాచోట్ల దరఖాస్తులు తక్కువ సంఖ్యలో నమోదయ్యాయి. జిల్లాలోని 20 మండలాలకు గాను 420మంది అధికారులు హాజరు కాగా.... కేవలం 272 ఫిర్యాదులే అందాయి. అత్యధికంగా సత్తుపల్లిలో 46ఫిర్యాదులు, తిరుమలాయపాలెం, కల్లూరు మండలాల్లో 26 చొప్పున, తల్లాడలో 25 ఫిర్యాదులు అందాయి. ఇక కామేపల్లిలో నాలుగు, చింతకానిలో మూడు, ఏన్కూరు మండలంలో కేవలం రెండు ఫిర్యాదులు అందడం గమనార్హం.

అనుమానమా...

మండల కేంద్రాల్లో ప్రజావాణిపై అధికారులు పెద్దగా ప్రచారం చేయకపోవడంతో స్పందన కరువైంది. మరోపక్క పలుమార్లు మండల అధికారులకు వినతిపత్రాలు సమర్పిస్తున్నా పరిష్కారం కాక కలెక్టరేట్‌కు వెళ్లాల్సి వస్తోంది. ఈ కారణంగా కూడా ప్రజలు ఆసక్తి చూపలేదని తెలుస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement