ఖమ్మం సహకారనగర్: పీఆర్‌సీ అమలు, పెండింగ్‌లో డీఏలు, బిల్లుల విడుదల, సీపీఎస్ విధానం రద్దు విషయంలో ప్రభుత్వం నిర్లక్ష్యాన్ని వీడకపోతే తగిన మూల్యం చెల్లించక తప్పదని ఎమ్మెల్సీ పింగిలి శ్రీపాల్‌రెడ్డి ప్రారంభించి హెచ్చరించారు. ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించాలనే డిమాండ్‌తో పీఆర్‌టీయూ ఆధ్వర్యాన ఖమ్మం కలెక్టరేట్ వద్ద సోమవారం ధర్నా నిర్వహించారు. జిల్లా అధ్యక్షుడు కట్టా శేఖర్‌రావు అధ్యక్షతన జరిగిన ధర్నాలో ఎమ్మెల్సీ శ్రీపాల్‌రెడ్డి మాట్లాడుతూ అధికారంలోకి వచ్చి 30 నెలలు దాటుతున్నా ప్రభుత్వం హామీలను నెరవేర్చలేదన్నారు. నిర్లక్ష్య ధోరణి ఇలాగే కొనసాగితే సెప్టెంబర్ 1 తర్వాత రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. అనంతరం పీఆర్‌టీయూ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు పులగం దామోదర్‌రెడ్డి, సుంకర బిక్షంగౌడ్ మాట్లాడుతూ దేశంలోని మరే రాష్ట్రంలో లేని విధంగా ఆరు డీఏలు పెండింగ్ పెట్టారని, సమస్యలను పరిష్కరించకపోగా ఉపాధ్యాయుల పట్ల సీఎం చులకనగా, వ్యంగ్యంగా మాట్లాడటం గర్హనీయమన్నారు. ఈపీఆర్‌టీయూ, అనుబంధ సంఘాల నాయకులు పి.వెంకటరెడ్డి, సోమిరెడ్డి శ్రీనివాసరెడ్డి, సతీష్‌రెడ్డి, చాగర్లముడి శ్రీధర్, సుబ్బయ్య, వేణు, మోత్కూరి మధు, యలమద్ది వెంకటేశ్వర్లు, ఝాన్సీసౌజన్య, రాము, విజయ్, అమృతకుమార్, ఆర్.బ్రహ్మారెడ్డి, టి.రత్నకుమార్, చిత్తలూరి ప్రసాదరావు, కే.వీ. రమణ, జీ.వీ.రమణ, రాయల నరసింహారావు, చెన్నకేశవరెడ్డి, రెబ్బా శ్రీనివాసరావు, సోమ్లా, రవికుమార్, కొమ్ము శ్రీనివాసరావు, గుడిపూడి శ్రీనివాసరావు, లింగం సతీష్ తదితరులు పాల్గొన్నారు.
పీఆర్‌టీయూ ధర్నాలో ఎమ్మెల్సీ శ్రీపాల్‌రెడ్డి


