పోటీపరీక్షలపై నిరుద్యోగులకు ఉచిత శిక్షణ | - | Sakshi
Sakshi News home page

పోటీపరీక్షలపై నిరుద్యోగులకు ఉచిత శిక్షణ

Aug 18 2026 12:51 AM | Updated on Aug 18 2026 12:51 AM

ఖమ్మంమయూరిసెంటర్‌: పోలీసు శాఖలో ఉద్యోగం సాధించాలనే పట్టుదలతో ఉన్న యువతకు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి చొరవతో ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు పొంగులేటి క్యాంపు కార్యాలయ ఇన్‌చార్జి తుంబూరు దయాకర్‌రెడ్డి తెలిపారు. ఖమ్మంలోని క్యాంపు కార్యాలయంలో సోమవారం ఆయన ఖమ్మం, కొత్తగూడెంలో ఎస్‌ఐ, కానిస్టేబుల్‌ పరీక్షలకు ఇచ్చే ఉచిత శిక్షణ పోస్టర్లు ఆవిష్కరించి మాట్లాడారు. 2016లోనే పొంగులేటి చొరవతో అందించిన ఉచిత శిక్షణ ద్వారా పలువురు ఉద్యోగాలు సాధించారని తెలిపారు. ఈసారి హైదరాబాద్‌కు చెందిన నిపుణులతో బోధన అందించనున్నట్లు చెప్పారు. ఆసక్తి ఉన్న అభ్యర్థులు పేరు, ఫోన్‌ నంబర్‌, గ్రామం, మండలం, నియోజకవర్గం వివరాలను 89850 95599(ఖమ్మం జిల్లా), 89850 96699(భద్రాద్రి జిల్లా) నంబర్లకు వాట్సప్‌ ద్వారా పంపించాలని మెండెం కిరణ్‌ సూచించారు. ఈ కార్యక్రమంలో ఏదులాపురం మున్సిపాలిటీ చైర్‌ పర్సన్‌ పోకబత్తిని అనిత, నాయకులు బొర్రా రాజశేఖర్‌, కోసూరి శ్రీను, కొప్పుల అశోక్‌, బజ్జూరి వెంకట్‌రెడ్డి, వెంకట్‌రెడ్డి, వెన్నుపూసల సీతారాములు, బానోత్‌ కిశోర్‌నాయక్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement