మైనర్లపై గంజాయి పంజా | - | Sakshi
Sakshi News home page

మైనర్లపై గంజాయి పంజా

Aug 20 2026 12:29 AM | Updated on Aug 20 2026 12:29 AM

● యువతతో రవాణా, అమ్మకాలు ● ఐదు నెలల్లో నమోదైన కేసుల్లో 20 మంది పిల్లలు ● తల్లిదండ్రులు అప్రమత్తం కాకపోతే ముప్పే.. ఇటీవల జిల్లా కేంద్రంలోని ఓ ప్రభుత్వ పాఠశాలలో తనిఖీకి కలెక్టర్‌ వెళ్లారు. కలెక్టర్‌ వస్తున్నట్లు తెలియగానే ఉపాధ్యాయులు గదులను శుభ్రం చేయిస్తుండగా ఓ తరగతి గది ఆవరణలోని స్లాబ్‌పై గంజాయి లభించినట్లు తెలిసింది. దీంతో పాఠశాల విద్యార్థులు కూడా గంజాయికి బానిసలుగా మారు తున్నారనే అనే అనుమానాలు వస్తున్నాయి.

జీవితానికి భరోసా

కదలికలు నిశితంగా పరిశీలించాలి

● యువతతో రవాణా, అమ్మకాలు ● ఐదు నెలల్లో నమోదైన కేసుల్లో 20 మంది పిల్లలు ● తల్లిదండ్రులు అప్రమత్తం కాకపోతే ముప్పే..

ఖమ్మంక్రైం: మునుపటితో పోలిస్తే జిల్లాలో గంజాయి మహమ్మారి మరింతగా విషం చిమ్ముతోంది. ఫలితంగా యువకులే కాక మైనర్లు కూడా బానిసలుగా మారుతున్నారు. ఇటీవల హైదరాబాద్‌ నుంచి వచ్చిన ఈగల్‌ టీమ్‌ బృందం కూడా జిల్లాలో గంజాయి రవాణా పెరిగిందని... మైనర్లు బానిసలుగా మారుతున్నారని పోలీస్‌, ఎక్సైజ్‌ శాఖలను హెచ్చరించినట్లు సమాచారం. ఈ సమయంలోనే నల్లగొండ జిల్లా కొండమల్లేపల్లిలోని ఓ ప్రైవేట్‌ స్కూల్‌లో గంజాయికి అలవాటు పడిన ముగ్గురు విద్యార్థులను మందలించడంతో కక్ష కట్టి ప్రిన్సిపాల్‌ను హత్య చేసినట్లు బయటపడడం సంచలనం కలిగింది.

చాలా కేసులో మైనర్లు

గంజాయి రవాణా, విక్రయాలను అరికట్టడానికి పోలీసు, ఎకై ్సజ్‌ అధికారులే కాక తరచూ ఈగల్‌ టీమ్‌ జిల్లాలో విస్తృత తనిఖీలు చేపడుతున్నాయి. ఈక్రమాన పట్టుబడుతున్న వారిలో ఒకరైనా మైనర్‌ ఉండడం ఆందోళన కలిగిస్తోంది. గడిచిన ఐదు నెలల్లో నమోదైన కేసుల్లో 20మంది మైనర్లు ఉండడం గమనార్హం.

ఆశ చూపించి అలవాటు...

ఒడిశా – ఏపీ సరిహద్దు(ఏఓబీ)ల్లో భారీగా గంజాయి సాగవుతున్నట్లు తెలుస్తోంది. ఈ గంజాయిని హైదరాబాద్‌, ఇతర ప్రాంతాలకు తరలించే క్రమాన నిందితులు ఉమ్మడి ఖమ్మం జిల్లా మీదుగా రాకపోకలు సాగిస్తున్నారు. ఈక్రమంలో అసలు నిందితులు బయటపడకుండా, ఎవరినీ అనుమానం రాదనే భావనతో గంజాయి రవాణా కోసం మైనర్లను ఉపయోగించుకున్నట్లు సమాచారం. బైక్‌లు కొనిస్తామని, డబ్బు ఇస్తామనే ఆశ చూపుతుండడంతో చదువు మానేసిన యువకులు, విద్యార్థులు ఆ వలలో చిక్కుకుంటున్నట్లు తెలిసింది. తొలుత గంజాయి రవాణాకే పరిమితమవుతున్న కొందరు ఎన్నడూ చూడనంత డబ్బు రాగానే క్రమంగా గంజాయి వినియోగానికి అలవాటు పడతున్నట్లు సమా చారం. ఖమ్మం త్రీటౌన్‌ ప్రాంతం ప్రకాష్‌నగర్‌కు చెందిన ఓ రౌడీషీటర్‌ ఓ విద్యార్థితో గంజాయి సరఫరా చేయిస్తుండగా ఇటీవల పట్టుబడ్డాడు.

బానిసలుగా మార్చి...

గంజాయి సరఫరా చేస్తూ పోలీసులకు చిక్కుతున్న మైనర్లను విచారించగా అసలు నిందితులు కాదని గుర్తించినట్లు సమాచారం. కొందరు మాత్రం చిన్నతనం నుంచే గంజాయికి అలవాటై డబ్బు కోసం అమ్మకాలు చేపడుతున్నట్లు తేలిందని చెబుతున్నారు. ఇతర ప్రాంతాల నుంచి తీసుకొచ్చేందుకు మైనర్లును ఉపయోగిస్తున్న నిందితులు.. ఆపై వారిని గంజాయికి బానిసలుగా మార్చి తమ వెంట తిప్పుకుంటున్నారని సమాచారం. ప్రధానంగా తల్లిదండ్రుల్లో ఎవరైనా ఒకరు లేనివారు, బంధువుల చెంతన బతుకుతున్న మైనర్లను లక్ష్యంగా చేసుకుని వారిని ఈ ఊబిలో దింపుతున్నట్లు తెలిసింది.

పాఠశాల గదిలో గంజాయి?

భద్రాచలంలో డీ అడిక్షన్‌ సెంటర్‌ – 8లో..

పిల్లలు గంజాయి మహమ్మారి బారిన పడకుండా తల్లిదండ్రులు పరిశీలిస్తుండాలి. యువకులు, మైనర్ల కదలికలను నిరంతరం పరిశీలిస్తూ ఎవరితో తిరుగుతున్నారో చూడాలి. తొలి దశలోనే అడ్డుకట్ట వేయాలి. చెడు మార్గాల్లో నడిస్తే ఎదురయ్యే అనర్థాలను వివరించాలి. కేసుల పాలయ్యాక బాధపడే బదులు ముందే అప్రమత్తంగా ఉంటే మేలు.

– ఎస్‌.వీ.రమణమూర్తి, ఖమ్మం ఏసీపీ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement