ఉచిత విద్యుత్‌ పేటెంట్‌ కాంగ్రెస్‌దే | - | Sakshi
Sakshi News home page

ఉచిత విద్యుత్‌ పేటెంట్‌ కాంగ్రెస్‌దే

Aug 20 2026 12:29 AM | Updated on Aug 20 2026 12:29 AM

ఉచిత విద్యుత్‌ పేటెంట్‌ కాంగ్రెస్‌దే

నేలకొండపల్లి: నాడు డాక్టర్‌ వై.ఎస్‌.రాజశేఖర్‌రెడ్డి రైతులకు ఉచిత విద్యుత్‌ అందిస్తే.. నేడు రేవంత్‌రెడ్డి నేతృత్వాన మళ్లీ తమ ప్రభుత్వమే ఉచిత విద్యుత్‌ అందిస్తోందని రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వెల్లడించారు. నేలకొండపల్లి మండలం కొంగర, బుద్ధారంలో పలు అభివృద్ధి పనులకు ఆయనకు శంకుస్థాపన చేశారు. అలాగే, చెరువుమాదారంలోని పలువురి ఇళ్లపై సోలార్‌ ప్యానళ్లను మంత్రి ప్రారంభించి మాట్లాడారు. పేదలకు ఉచిత విద్యుత్‌ అందిస్తూనే, పైలట్‌ గ్రామాల్లో ఇళ్లు, రైతుల పంపుసెట్లకు సోలార్‌ ప్యానళ్లు బిగిస్తున్నామని చెప్పారు. అనంతరం కలెక్టర్‌ దివాకర మాట్లాడుతూ చెరువుమాధారంలో తొలిదశగా 713 ఇళ్లపై సోలార్‌ ప్లాంట్లు బిగిస్తున్నామని తెలిపారు. కాగా, కొంగర సర్పంచ్‌ కృష్ణకుమారి, పలువురు వార్డు సభ్యులు మంత్రి సమక్షాన కాంగ్రెస్‌లో చేరారు. విద్యుత్‌ ఎస్‌ఈ శ్రీనివాసచారి, రెడ్‌కో జిల్లా మేనేజర్‌ పి.అజయ్‌కుమార్‌, ఆర్‌డీఓ శ్రీనివాస్‌, మార్కెట్‌ చైర్మన్‌ వి.సీతారాములు, సర్పంచ్‌లు యల్లయ్య, బి.వేణు, కట్టెకోల నాగార్జున, సత్యం, నాయకులు బచ్చలకూరి నాగరాజు, కొడాలి గోవిందరావు, శ్రీనివాసరెడ్డి, జెర్రిపోతుల అంజని, మామిడి వెంకన్న తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement